Ganesh Chaturthi : ‘పుష్ప 2’ థీమ్‌తో గణేష్ మండపం..బన్నీ క్రేజ్ మాములుగా లేదుగా !!

Ganesh Chaturthi : ‘పుష్ప 2’ రిలీజ్‌ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న తరుణంలో అల్లు అర్జున్‌ క్రేజ్‌ మరింత రెట్టింపవుతోంది. ఆ సినిమా తర్వాత ఆయన కొత్త ప్రాజెక్ట్‌ కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Published By: HashtagU Telugu Desk
Pushpa 2 Set

Pushpa 2 Set

పుష్పరాజ్‌ (Pushparaj)అనే పేరు ఇప్పుడు కేవలం సినిమా క్యారెక్టర్‌ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఒక బ్రాండ్‌గా మారింది. “పుష్ప: ది రైజ్” సినిమా తర్వాత అల్లు అర్జున్‌ క్రేజ్‌ పాన్‌ ఇండియా స్థాయిలో అమాంతం పెరిగిపోయింది. ఆ సినిమా ఇంపాక్ట్‌ ఎంత బలంగా ప్రజల మనసుల్లో ముద్ర వేసిందో చెప్పడానికి హోసూరులో జరిగిన ఒక సంఘటన చక్కటి ఉదాహరణ. అక్కడ గణేష్‌ మండపాన్ని ‘పుష్ప 2: ది రూల్’ థీమ్‌ ఆధారంగా నిర్మించడం అభిమానుల అభిమానాన్ని చాటిచెప్పింది.

Janasena : నేటి నుండి మూడు రోజుల పాటు జనసేన విస్తృత స్థాయి సమావేశాలు

ప్రతి ఏడాది వినాయక చవితి (Ganesh Chaturthi) సందర్భంగా ప్రజలు వినాయక మండపాలను క్రియేటివ్‌గా రెడీ చేస్తారు. ఈసారి తమిళనాడు హోసూరు సమీపంలోని దెన్‌ కనికొట్టై ప్రాంతంలో “పుష్ప 2″లోని హెలికాఫ్టర్ సీన్‌, “రప్పా రప్పా” ఫైట్‌ను గుర్తు చేసేలా మండపం నిర్మించారు. దాదాపు 30 లక్షల రూపాయల భారీ ఖర్చుతో ఈ ప్రత్యేక మండపం నిర్మించబడింది. పుష్ప స్టైల్‌లో గణపతి బప్పా దర్శనమివ్వడం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ జాతీయస్థాయిలో చర్చనీయాంశమైంది.

‘పుష్ప 2’ రిలీజ్‌ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న తరుణంలో అల్లు అర్జున్‌ క్రేజ్‌ మరింత రెట్టింపవుతోంది. ఆ సినిమా తర్వాత ఆయన కొత్త ప్రాజెక్ట్‌ కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ చేయబోయే సైన్స్‌ ఫిక్షన్‌ పాన్‌ వరల్డ్‌ సినిమా కోసం పెద్ద ఎత్తున అంచనాలు పెరిగిపోయాయి. పుష్పరాజ్‌ సృష్టించిన ఇంపాక్ట్‌ మీద పదింతలు ఇవ్వాలని ప్రయత్నిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ మరోసారి అల్లు అర్జున్‌ పేరు ప్రపంచస్థాయిలో గర్జించేలా చేస్తుందని అభిమానులు నమ్ముతున్నారు.

  Last Updated: 28 Aug 2025, 10:35 AM IST