Site icon HashtagU Telugu

Five Signs: మీకు కూడా ఈ ఐదు సంకేతాలు కనిపించాయా.. అయితే మీపై నరదృష్టి పడినట్టే?

Five Signs

Compressjpeg.online 1280x720 Image (1) 11zon

Five Signs: ప్రస్తుత రోజుల్లో పక్క వారు ఎదుగుతుంటే చూసే సంతోషపడే వారి కంటే కుళ్ళుకునే (Five Signs) వారి సంఖ్యనే ఎక్కువగా ఉంది. మనం వ్యాపారం చేస్తున్నప్పుడు కానీ ఇల్లు కొనుగోలు చేయడం,కొంచెం డబ్బు బాగా సంపాదిస్తున్నా కానీ పక్కన మనమంటే గిట్టని వారు మనల్ని చూసి ఓర్వలేక మనపై దిష్టి పెడుతూ ఉంటారు. చాలా వరకు వస్తువులకు, మనుషులకి దిష్టి తగులుతూ ఉంటుంది. ముఖ్యంగా కొందరి దిష్టి కళ్ళు ఏమాత్రం మంచిది కాదు. వాటి వల్ల ఊహించని సమస్యలు చుట్టుముట్టడంతో పాటు సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అందుకే నరదృష్టి తగిలితే నల్ల రాయి కూడా పగిలిపోతుందని పెద్దలు చెబుతూ ఉంటారు.

ఒకవేళ మీరు కూడా ఇతరుల కంటే బాగా ఉంటే మీకు కూడా నరదిష్టి తలిగి తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే నరదృష్టి తగిలిందని ఎలా తెలుస్తుంది?అప్పుడు ఏమైనా సంకేతాలు కనిపిస్తాయా అంటే అవును అంటున్నారు పండితులు. వాటిని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలామంది తరచూ ఏదోక విషయంతో ఏడుస్తూ బాధపడుతూనే ఉంటారు. తరచూ అలాగే చేస్తుంటే వారిపై దిష్టి ప్రభావం ఎక్కువగా ఉంది అని అర్థం చేసుకోవాలి. అలాగే ఎక్కువగా నిద్రపోవడం, ముఖం వాడిపోయినట్టుగా అనిపించి డల్ గా అనిపించడం లాంటివి జరిగినప్పుడు కూడా దిష్టి తగిలిందని అర్థం చేసుకోవాలి. కొన్ని కొన్ని సార్లు మనకు ఎటువంటి అనారోగ్య సమస్య లేకపోయినా వాంతులు విరోచనాలు అవ్వడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి.

Also Read: Ayyappa Song: అయ్యప్పస్వాముల ‘హరివరాసనం’ పాటకు ఉన్న విశిష్టత ఇదే

అలాంటప్పుడు కూడా దిష్టి తగిలిందని అర్థం చేసుకోవాలి. అందుకే చిన్న పిల్లలకు ఎవరైనా బాధ లేని వారికి దిష్టి తీయాలి అని అంటూ ఉంటారు. ప్రస్తుతం మనమున్న సొసైటీలో ఎవరైనా మంచిగా బతికితే చాలు చూసి ఓర్వలేని వారు చాలామంది ఉన్నారు. మనమంటే గిట్టని వారు మనల్ని చూసి ఓర్చుకోలేని వారు మన ఎదుగుదలను చూసి ఓర్చుకోలేని వారు మనం బాగుపడకూడదని దిష్టి పెట్టడం చూసి కుళ్ళు కోవడం లాంటివి చేస్తూ ఉంటారు. బాగా జరుగుతున్న వ్యాపారం సడన్గా ఆగిపోవడం దివాళ తీయడం లాంటి జరిగినప్పుడు కూడా దిష్టి తగిలిందని అర్థం చేసుకోవాలి.