Money Tips: అలాంటి వస్తువులు ఇంట్లో ఉంటే చాలు.. కాసుల వర్షం కురవాల్సిందే?

మామూలుగా చాలామంది దగ్గర ఎంత డబ్బు సంపాదించినా కూడా చేతిలో నిలవడం లేదని బాధపడుతూ ఉంటారు. చేతికందిన డబ్బు అందినట్టుగానే అంది మళ్లీ చేజారి

Published By: HashtagU Telugu Desk
Measures Of Money Supply In India

Measures Of Money Supply In India

మామూలుగా చాలామంది దగ్గర ఎంత డబ్బు సంపాదించినా కూడా చేతిలో నిలవడం లేదని బాధపడుతూ ఉంటారు. చేతికందిన డబ్బు అందినట్టుగానే అంది మళ్లీ చేజారి పోతుందని అదనంగా అప్పులు కూడా చేయాల్సి వస్తుందని బాధపడుతూ ఉంటారు. అయితే డబ్బు నిల్వ లేక పోవడానికి కారణం ప్రతికూల వాతావరణం అలాగే వాస్తు విషయాలు కూడా కారణం కావచ్చు. అలా డబ్బులు వచ్చినా చేతిలో నిల్వ ఉండటం లేదు అంటే అలాంటి సమయంలో కొన్ని రకాల పరిహారాలు పాటించడం తప్పనిసరి. మరి ఈరోజు పరిహారాలు పాటించాలో ఎప్పుడు మనం తెలుసుకుందాం.. అలాగే ఇంట్లో కొన్ని రకాల వస్తువులు ఉంటే చాలుట.

ఆ ఇంట్లోని వారికి ఈ కాసుల వర్షం కురవాల్సిందే అంటున్నారు పండితులు. ఇంట్లో చందనం గందపు చక్క ఇంట్లో ఉంటే ఎలాంటి దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించవు. గందాన్ని అరగదీసి దేవుడి విగ్రహానికి పెట్టడంతో పాటు నుదుటికి దిద్దుకుంటే ఎంతో పవిత్రత చేకూరుతుంది. ఇలా చేయడం వల్ల సంపద అయస్కాంతంలా మిమ్మల్ని అంటి పెట్టుకుని ఉంటుంది. ఆవు పాలతో తయారు చేసిన నెయ్యిని చాలా పవిత్రంగా భావిస్తారు. ఇంట్లో ఆవు నెయ్యితో దీపం వెలిగించి దేవతలను పూజిస్తుంటారు. ఇంట్లోనే నెయ్యిని తయారు చేసుకుంటే ఆరోగ్యంతో పాటు లక్ష్మీ దేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఇక మరో వస్తువు వీణ. కమలం పువ్వు మీద ఆసీనురాలైన సరస్వతీ దేవిని ముట్టుకోకూడదట.
ఒక వేళ అలా చేస్తే పేదరికానికి కారణం అవుతుందట.

ఇలాంటి విగ్రహాలు, చిత్రపటాలు ఇంట్లో ఉండటం అస్సలు మంచిది కాదట. ఇక తేనే విషయానికి వస్తే దీని వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇంట్లోనే ప్రతికూల శక్తులను తొలగించి, అనుకూల వాతావరణాన్ని కలిగిస్తుంది తేనె. ఇంట్లోని పరిశుధ్దమైన ప్రాంతంలో తేనెను ఉంచి ఇంట్లోకి కుటుంబ సభ్యులు అందరూ ప్రతి రోజు తీసుకోవాలట. ఇలా చేయడం వల్ల ఆర్థిక పరిస్థితులు అనిశ్చిత తొలగడంతో పాటు అధిక ఖర్చులు కూడా తగ్గుతాయట. దీనితో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందట.

  Last Updated: 04 Dec 2023, 04:02 PM IST