Site icon HashtagU Telugu

Election Code: తిరుమలలో రికమండేషన్ కుదరదు

Election Code

Election Code

Election Code: దేశంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రానున్న నేపథ్యంలో శనివారం నుంచి వీఐపీ దర్శనం, వసతి గృహాల విషయంలో టీటీడీ పలు మార్పులు చేసింది. ఇక నుంచి తిరుమలలో బస, దర్శనానికి సంబంధించిన సిఫార్సులు కుదరవని స్పష్టం చేసింది. ఆంటే రికమండేషన్ చెల్లదని చెప్పింది. ఈ మేరకు రికమండేషన్ లేఖలను గతంలో మాదిరిగా స్వీకరించబోమన్నారు. కోడ్ ముగిసే వరకు నిబంధనల ప్రకారం స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే శ్రీవారి దర్శనం మరియు వసతి పరిగణించబడుతుందని పేర్కొంది టిటిడి.

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో టీటీడీ ట్రస్టుబోర్డు నిర్ణయం మేరకు శనివారం నుంచి తిరుమలలో వసతి, శ్రీవారి దర్శనానికి సంబంధించిన సిఫారసు లేఖలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. కావున భక్తులు, వీఐపీలు ఈ ముఖ్యమైన విషయాన్ని గమనించి నిర్వాహకులకు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత మరియు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసిన తర్వాత ఈ సౌకర్యాలను పునరుద్ధరించాలనే నిర్ణయం తీసుకోనుంది.

Also Read: Mumbai Indians: ముంబై ఇండియ‌న్స్‌కు మ‌రో షాక్‌.. కీల‌క ఆట‌గాడికి గాయం..?