Site icon HashtagU Telugu

Vastu Tips-Food Eating : ఏ దిక్కుకు తిరిగి భోజనం చేయాలో తెలుసా ?

Vastu Tips Food Eating

Vastu Tips Food Eating

Vastu Tips-Food Eating : మనం చేసే ప్రతి పనికి రూల్స్ ఉంటాయి.  

భోజనం చేయడానికి కూడా రూల్స్ ఉంటాయి.  

ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ కూర్చొని భోజనం చేయకూడదు. 

తప్పుడు దిశలో కూర్చొని భోజనం చేస్తే వాస్తు దోషానికి గురవుతారు. 

వాస్తు దోషాల వల్ల మన ప్రగతికి, కుటుంబ సంతోషానికి, శాంతికి భంగం కలుగుతుంది.

అందుకే భోజనం చేసేటప్పుడు వాస్తు నియమాలను పాటించాలి. 

వాస్తు ప్రకారం ఎప్పుడూ నేలపై కూర్చొని భోజనం చేయాలి. ఆహారం తినేటప్పుడు(Vastu Tips-Food Eating) మీ ముఖం ఎల్లప్పుడూ ఉత్తరం దిక్కు వైపు లేదా తూర్పు దిక్కు వైపు ఉండాలి. దీనివల్ల మీకు  ఆరోగ్యంతో పాటు, ఆహారం సమృద్ధిగా లభిస్తుందని చెబుతారు. దీనికి విరుద్ధంగా దక్షిణ దిశ, పడమర దిశకు తిరిగి భోజనం చేయడం మంచిది కాదు. ఈ దిశల వైపు తిరిగి  భోజనం చేస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే మీరు డైనింగ్ టేబుల్ వద్ద కూర్చొని భోజనం చేస్తుంటే, మీ ముఖాన్ని ఎల్లప్పుడూ తూర్పు వైపు ఉండేలా చూసుకోవాలని వాస్తు నిపుణులు  సలహా ఇస్తున్నారు.

Also read : Vasthu Tips: అద్దె ఇల్లు అయినా సరే వాస్తు నియమాలు తప్పనిసరి.. లేదంటే?

భోజనం చేసేటప్పుడు టీవీ, ఫోన్ చూడొద్దు       

మీ  ఇంట్లోని డైనింగ్ టేబుల్ ను ఎప్పుడూ ఖాళీగా ఉంచొద్దు. దానిపై పండ్లు, స్వీట్లు, ఆహార పదార్థాలను ఉంచాలి. చాలామంది అన్నం తినేటప్పుడు శ్రద్ధ భోజనం పై కాకుండా టీవీల మీద, ఫోన్ల మీద పెడుతూ ఉంటారు. అది ఏమాత్రం మంచిది కాదని వాస్తు నిపుణులు సలహా ఇస్తున్నారు. భోజనం చేసేటప్పుడు శ్రద్ధ, భక్తి భోజనం పైనే ఉంచాలని సూచిస్తున్నారు. అప్పుడే అన్నపూర్ణ దేవి కటాక్షం కలుగుతుందని అంటున్నారు.

ప్లేట్ లో అన్నం వదిలిపెట్టొద్దు 

చాలామంది శబ్దం వచ్చేలా భోజనం చేస్తూ ఉంటారు. అది మంచిది కాదు. శబ్దం రాకుండా భోజనం చేయాలి. భోజనం చేసేటప్పుడు ప్లేట్ లో కొంత ఆహారాన్ని వదిలేస్తూ ఉంటారు. ఇలా ఫుడ్ వదిలి పెట్టడం మంచిది కాదని వాస్తు నిపుణులు అంటున్నారు.

Also read : Vastu Tips: ఏం చేసినా కూడా కలిసి రావడం లేదా.. అయితే వాస్తు దోషం ఉందేమో చెక్ చేసుకోండిలా?

కంచంలో చేతులు కడగొద్దు

భోజ‌నం చేసిన  తర్వాత కంచంలోనే చేతులు కడుక్కుంటే.. తిన్న ఆహారాన్ని అవమానించినట్లే. కంచంలో చేతులు కడుక్కోవడానికి బదులుగా, సింక్ వద్ద లేదా మ‌రో ప్రాంతంలో చేతులు కడుక్కోవాలి. అన్నం తిన్న వెంటనే కంచం కడిగి శుభ్రం చేయాలి.

గమనిక: ‘ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.

Exit mobile version