Thursday : గురువారం రోజు పొరపాటున కూడా అలాంటి పనులు అస్సలు చేయకండి.. చేసారో?

గురువారం (Thursday) కూడా కొన్ని తెలిసి తెలియకుండా కొన్ని రకాల పనులు అస్సలు చేయకూడదు. పొరపాటున కూడా అలాంటి పనులు చేశారంటే అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

  • Written By:
  • Publish Date - January 26, 2024 / 05:47 PM IST

హిందువులు వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడిని ప్రత్యేకంగా భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. అలాగే వారంలో కొన్ని రోజుల్లో కొన్ని రకాల పనులు అస్సలు చేయకూడదు. కొన్ని రకాల పనులు చేయడం నిషేధం. అలా గురువారం (Thursday) కూడా కొన్ని తెలిసి తెలియకుండా కొన్ని రకాల పనులు అస్సలు చేయకూడదు. పొరపాటున కూడా అలాంటి పనులు చేశారంటే అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి గురువారం (Thursday) రోజున ఇలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మహిళలు గురువారం (Thursday) త‌ల‌స్నానం చేయ‌కూడ‌దు.

We’re now on WhatsApp. Click to Join.

ఇలా చేయడం వల్ల జాతకంలో గురు స్థానం బలహీనపడుతుంది. దీనితో పాటు, వైవాహిక జీవితంపై చెడు ప్రభావం ప‌డుతుంది. ఆ దంప‌తుల‌కు సంతానం క‌ల‌గ‌క‌పోవ‌చ్చు. గురువారం రోజు క్షుర‌క‌ర్మ‌ చేయకూడదు. ఇలా చేయడం వల్ల సంతానం విషయంలో అనేక రకాల సమస్యలు త‌లెత్తుతాయి. అలాగే గురువారం రోజు చేతి గోర్లు, కాళ్ల‌ గోర్లు కత్తిరించకూడదు. ఇలా చేయడం వల్ల వారి ఆరోగ్యంపై చెడు ప్రభావం ఉంటుంది. జాత‌కంలో గురు గ్రహం స్థానం బలహీనంగా మారుతుంది. అదేవిధంగా గురువారం నాడు దక్షిణం, తూర్పు, నైరుతి దిశ‌ల్లో పూజ చేయడం మంచిది కాదు. ముఖ్యంగా ఈ రోజు దక్షిణం వైపు తిరిగి అస్స‌లు పూజ చేయ‌కూడ‌దు.

గురువారం రోజు అరటిపండ్లు తిన‌కూడ‌దు. ఈ రోజు అరటి మొక్కను భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో పూజించాలి. గురువారం రోజు బట్టలు ఉతకడం, ఇల్లు క‌డ‌గ‌డం లాంటివి అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఇది జాతకంలో గురు స్థానంపై చెడు ప్రభావం చూపుతుంది. ల‌క్ష్మీదేవి ఆగ్ర‌హానికి కార‌ణ‌మ‌వుతుంది. ఈ రోజు నీలం, నలుపు దుస్తులు ధరించడం మంచిది కాదు. కాబట్టి పొరపాటున కూడా మీరు గురువారం రోజు ఇలాంటి తప్పులు తెలిసి తెలియకుండా కూడా అస్సలు చేయకండి.

Also Read:  Spinach : బచ్చలి కూర వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా?