Karthika Masam : కార్తీక మాసంలో నీటిలో దీపాలను ఎందుకు వదులుతారో తెలుసా?

కార్తీక మాసం (karthika masam)లో చెరువులు, నదులు, కోనేరులలో దీపాంతులను వదులుతూ ఉంటారు. అలా సూర్యోదయం అయ్యే సమయానికి నదీతీరం దీపకాంతులతో వెలిగిపోతుంటుంది.

  • Written By:
  • Publish Date - November 22, 2023 / 05:20 PM IST

Karthika Masam : హిందువులకు కార్తీక మాసం ఎంతో ప్రత్యేకమైనదని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ కార్తీక మాసం (karthika masam)లో నెలరోజులపాటు మాంసాహారాన్ని తినకుండా నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు.. అంతేకాకుండా ఉదయాన్నే మాగ స్నానాలు చేసి ఇంట్లో ముఖ ద్వారం వద్ద తులసి మొక్క వద్ద దీపాంతులను కూడా వెలిగిస్తూ ఉంటారు. అలాగే ఈ నెల మొత్తం కూడా శివాలయాలలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించడంతోపాటు భక్తులతో కిక్కిరిసిపోతూ ఉంటాయి. అయితే కార్తీక మాసంలో భక్తులు నీటిలో దీపాలను వదులుతూ ఉంటారు. అయితే అలా ఎందుకు వదులుతారు దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అన్నది చాలా మందికి తెలియదు. మరి అలా ఎందుకు వదులుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re Now on WhatsApp. Click to Join.

కార్తీక మాసం (karthika masam)లో చెరువులు, నదులు, కోనేరులలో దీపాంతులను వదులుతూ ఉంటారు. అలా సూర్యోదయం అయ్యే సమయానికి నదీతీరం దీపకాంతులతో వెలిగిపోతుంటుంది. ఆకాశం, నీరు, అగ్ని, గాలి, భూమి ఈ పంచభూతాలు, సకల ప్రాణికోటికీ జీవనాధారాలు. శివ పంచాక్షరీ మంత్రం అయిన నమశివాయ అనే పంచ బీజాక్షరాల నుంచి పంచభూతాలు, వాటి నుంచి సమస్త జగత్తు పుట్టిందని శాస్త్రవచనం. శివ అనే శబ్దానికి శుభం, క్షేమం, శ్రేయం, మంగళం అని అర్థాలు ఉన్నాయి. ఈ జగత్తు అంతా శివమయమే అయినప్పుడు అంతా శివోహమే కదా. పంచ భూతాలను కూడా తనలో లయం చేసుకుని పరమశివుడు స్వయంగా కొలువైన క్షేత్రాలు పంచభూత క్షేత్రాలు.

అంటే శివం పంచభూతాత్మకం అని తెలిసినప్పుడే దీపాలు నీటిలో ఎందుకు విడిచిపెట్టాలనేది అర్థం అవుతుంది. అలాగే ఆత్మను జ్యోతి స్వరూపంగా భావిస్తారు. మరణానంతరం మనలో ఉండే ఆత్మ జ్యోతి స్వరూపంగా మారి భగవంతుడిని చేరుతుందని చెబుతారు. అయితే పంచభూతాల్లో ఒకటైన అగ్ని అనే జ్యోతి స్వరూపాన్ని పంచభూతాల్లో మరొకటైన నీటిలో వదలుతున్నారు. అంటే ఆత్మని పంచ భూతాత్మకం అయిన పరమేశ్వరుడి అంకితం చేయడమే దీని వెనుకున్న ఆంతర్యం. అది కూడా పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసం (karthika masam)లో దీపాలు వెలిగించి నదుల్లో, చెరువుల్లో వదిలితే పూర్వజన్మలో చేసిన పాపాలతో పాటూ ఈ జన్మలో చేసిన పాపాలు కూడా నశించి పరమేశ్వరుడి సన్నిధికి చేరుతామని అర్థం.

అందుకే బ్రహ్మ ముహూర్తంలో స్నానమాచరించి త్రికరణ శుద్ధిగా కార్తీక దీపాలు నీటిలో విడిచిపెడతారు. అదేవిధంగా అన్ని మాసాల్లో చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పోల్చుకుంటే కార్తీకమాసంలో చేసే ఉపవాసం స్నానం, దానం ఎన్నో మంచి మంచి ఫలితాలను ఇస్తాయి. కాబట్టి ఈ నెల రోజులు నిత్యం సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించి ఆలయానికి వెళ్లి దీపారాధన చేస్తే అత్యంత పుణ్యఫలం. నెలంతా సాధ్యం కాని వారు కనీసం కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణిమ, ఏకాదశి రోజుల్లో అయినా ఆలయాల్లో దీపం వెలిగిస్తే శుభం జరుగుతుంది.

Also Read:  Healthy Drinks: కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి ఇంట్లోనే దొరికే బెస్ట్ డ్రింక్స్ ఇవే..!