Snake vs Pregnant Woman : గర్భవతిని పాము ఎందుకు కాటు వేయదో మీకు తెలుసా?

గర్భిణీ స్త్రీలను పాము కాటు (Snake Byte) వేయదు అన్న నమ్మకం కూడా ఒకటి. ఇది మన పెద్దలు అనగా పూర్వకాలం నాటి నుంచే ఉంది.

  • Written By:
  • Publish Date - December 26, 2023 / 08:40 PM IST

Snake vs Pregnant Woman : మామూలుగా హిందువులు ఆచార సంప్రదాయాలతో పాటు మూఢ నమ్మకాలను కూడా నమ్ముతూ ఉంటారు. ముఖ్యంగా మతం చెప్పింది నమ్మే వారు చాలా మంది ఉంటారు. ఈ నమ్మకాలను పుక్కిటి పురాణాలుగా కొట్టి పడేసే వారు కూడా ఉన్నారు. అటువంటి వాటిలో గర్భిణీ స్త్రీలను పాము కాటు (Snake Byte) వేయదు అన్న నమ్మకం కూడా ఒకటి. ఇది మన పెద్దలు అనగా పూర్వకాలం నాటి నుంచే ఉంది. కొందరు ఈ విషయాన్ని నమ్మగా మరికొందరు మాత్రం కొట్టి పడేస్తూ ఉంటారు. గర్భిణిని చూడగానే పాము (Snake) చూపుకోల్పొతుందని, గర్భం దాల్చిన వారి దగ్గరకు పాము (Snake) వెళ్లదని అంటుంటారు. అంతేకాకుండా ఆ గర్భిణీ స్త్రీ డెలివరీ అయిన తర్వాత ఆ పాముకు చూపు మళ్ళీ తిరిగి వస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. మరి ఇందులో నిజానిజాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

ముందుగా గర్భవతిని పాము ఎందుకు కాటెయ్యదు? అన్న విషయానికి వస్తే.. పాముకు కొన్ని ప్రత్యేక ఇంద్రియాలను సహజంగా కలిగి ఉంటుంది. వాటి ద్వారా స్త్రీ గర్భవతి అవునో కాదో పాములు సులభంగా గుర్తిస్తాయట. గర్భవతు ల శరీరంలో జరిగే మార్పులను పాములు చాలా సులభంగా గుర్తించగలుగుతాయి. కానీ గుర్తించినంత మాత్రాన గర్భిణులను పాము ఎందుకు కాటెయ్యదు అనేది ప్రశ్న.

గర్భవతులను పాములు ఎందుకు కాటెయ్యవనే ప్రశ్నకు సమాధానం బ్రహ్మవైవర్తన పురాణంలో దొరకుతుంది. ఒకప్పుడు ఒక గర్భిణి శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు తపస్సు చేస్తుంది. ఆమె పూర్తిగా తపస్సులో మునిగి ఉండగా రెండు పాముల కారణంగా ఆమెకు తపోభంగం కలిగింది. ఆమె తపస్సుకు భంగం వాటిల్లినందుకు ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ సర్పజాతికి గర్భిణిని చూసిన వెంటనే అంథత్వం కలిగే విధంగా శాపంపెట్టిందట. అప్పటి నుంచి గర్భిణి ని చూసిన పాములు గుడ్డివి అయిపోతాయనే కథ ప్రాచుర్యంలో ఉంది. గర్భిణులకు కలలో కూడా పాము కనిపించదని కూడా చెబుతారు.

ఆ స్త్రీ ప్రసవించిన బిడ్డ శ్రీగోగా జీ దేవ్, శ్రీతేజాజీ దేవ్, జహర్వీర్ అనే పేర్లతో భవిష్యత్తుల ప్రసిద్ధి చెందినట్టు కూడా కథ ఒకటి ఉంది. గర్భిణి ని పాము కాటు వెయ్యకపోవడానికి కేవలం మత విశ్వాసం మాత్రమే కాదు శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. గర్భిణి శరీరంలో హర్మోన్ల స్వరూపం భిన్నంగా ఉంటుంది. అందువల్ల ఆమె శరీరంలో కొన్ని ప్రత్యేక మార్పులు జరుగుతాయి. అందుకే గర్భస్త సమయంలో స్త్రీ స్వభావం, ఆసక్తి, రంగు రూపుల్లో చాలా మార్పులు వస్తాయి. ఈ హార్మోన్ల మార్పును పాములు త్వరగా గుర్తిస్తాయేమో అనే ఇక వాదన ఉంది. ఈ విషయానికి సంబంధించిన దృవీకరణలు అందుబాటులో లేవు.

Also Read:  Apple AirPods Pro: ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రోపై భారీ డిస్కౌంట్.. కేవలం రూ. 323కే సొంతం చేసుకోండిలా?