Vastu And Money: వాస్తు ప్రకారం డబ్బును ఏ దిశలో దాచాలో తెలుసా..?

ఇంట్లో డబ్బును బీరువాలో కానీ...పెట్టెలో కానీ దాచుకుంటాం. అయితే వాస్తు ప్రకారం డబ్బును ఏ ది శలో దాచుకోవాలో తెలుసా.

  • Written By:
  • Publish Date - June 4, 2022 / 09:00 AM IST

ఇంట్లో డబ్బును బీరువాలో కానీ…పెట్టెలో కానీ దాచుకుంటాం. అయితే వాస్తు ప్రకారం డబ్బును ఏ ది శలో దాచుకోవాలో తెలుసా. చాలాసార్లు ఇంట్లో డబ్బు దాచిపెట్టినప్పటికీ…మనకు కలిసి రాదు. వ్యాపారంలో నష్టాలు రావడం…దోపిడికి గురికావడం జరుగుతుంటాయి. దీనికి కారణం మనం వాస్తు ప్రకారం డబ్బును సరైన దిశలో దాచకపోవడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు.

డబ్బును ఈ దిశలో ఉంచకూడదు…
వాస్తు ప్రకారం…డబ్బు విలువైన పత్రాలు, ఆభరణాలు దాచుకునే బీరువా లేదా పెట్టెను పశ్చిమం, వాయువ్యంలో ఉంచకూడదు. ఈ దిశలో దాచితే ధన నష్టం, దొంగతనం జరిగే ఛాన్స్ ఉంటుందని పండితులు చెబుతున్నారు. వాస్తులో వాయువ్య దిశ అనేది డబ్బుకు సంబంధించి మంచిది కాదు.

ఈ దిశలో డబ్బు ఉంచడం మంచిది…
వాస్తు ప్రకారం…డబ్బును ఎల్లప్పుడూ నైరుతి దిశలోనే ఉంచాలి. దొంగతనాల భయం ఉండదు. ఈ దిశలో డబ్బును దాచిపెట్టినప్పుడు..అక్కడ కిటికీలు, తలుపులు ఉండకూడదు.

ముఖ్యంగా ఉత్తరం గోడ, పడమటి గోడ రెండూ కలిసిన మూల అయిన వై వీధిలో బీరువా పెడితే మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఉత్తరానికి బీరువా వెనకభాగం చూసే విధంగా డబ్బులు, నగలు పెడితే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తూ..పోతుందట.

నైరుతి మూలలో బీరువాలో డబ్బులు, నగలు పెడితే ఇబ్బందులు తప్పవు. అంతేకాదు నగలు, డబ్బులు, పెరగవని జీవితంలో ఆర్ధిక వ్రుద్ధి ఉండదని చెబుతున్నారు. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలంటే బీరువానే సరైన స్థానంలో పెట్టడంతోపాటు..కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. డబ్బును నిర్లక్ష్యంగా ఎక్కడపడితే అక్కడ పెట్టకూడదని వాస్తుశాస్త్రం చెబుతోంది.

వాస్తు ప్రకారం నిర్ధేశించిన దిక్కులలో ధనాన్ని పెడితే..ధనం వ్రుద్ధి చెందుతుంది. ఇంట్లో సంతోషంగా ఉంటారు. ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి కటాక్షం పొందవచ్చని వాస్తు నిపుణులు చెబుతున్నారు.