Shambala : నిత్యయవ్వనం ప్రసాదించే మూలికలు @ ‘శంబల’ !?

శంబల.. ఇదొక నగరం పేరు. పురాణాల్లో దీని గురించి ప్రస్తావన ఉంది.  వాస్తవానికి శంబల అనేది సంస్కృత పదం.

Published By: HashtagU Telugu Desk
Shambala

Shambala : శంబల.. ఇదొక నగరం పేరు. పురాణాల్లో దీని గురించి ప్రస్తావన ఉంది.  వాస్తవానికి శంబల అనేది సంస్కృత పదం. దీన్ని టిబెట్‌ భాషలో ‘షాంగ్రిలా’ అని.. హిందూ పురాణాల్లో ‘సిద్ధాశ్రమం’ అని,  ‘ భూలోక స్వర్గం’ అని పిలుస్తుంటారు. 1903వ సంవత్సరంలో కొందరు గూఢచారులు శంబల నగరాన్ని అన్వేషిస్తూ వెళ్లారు. అప్పట్లో హిమాలయాల్లో తాము చూసిన వింతలన్నింటిపై కొన్ని పుస్తకాలు  రాశారు. అవి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అప్పటి నుంచి శంబల నగరాన్ని చూడాలనే కోరిక అందరిలో పెరిగింది.

We’re now on WhatsApp. Click to Join

శంబల నగరం చైనా ఆక్రమిత టిబెట్ పరిధిలో ఉంది. ఈ నగరం పక్కనే కైలాస పర్వతం, మానస సరోవరం ఉన్నాయి. ఇవి కూడా చైనా పరిధిలోనే ఉన్నాయి. ఎవరెస్ట్ అడుగున ఓ సొరంగ మార్గం ఉంది. ఆ మార్గం గుండా వెళ్తే గడ్డకట్టిన మంచునది ఉంటుంది. దాని అడుగున మరో సొరంగం ఉంటుంది.  అది దాటితే ఓ పర్వతం, అందులో గుహ ఉంటాయి. వాటిని దాటి వెళితే మంచుకొండల మధ్య స్పటిక పర్వతం ఉంటుంది. దాని కింద ఉన్న నగరమే శంబల.

Also Read :YS Jagan Convoy : మాజీ సీఎం వైఎస్ జగన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

శంబల విశేషాలు

  • భాగవతపురాణం, బ్రహ్మవైవర్త పురాణం, విష్ణుపురాణం, బౌద్ధుల కాలచక్ర గ్రంధంలో శంబల గురించి ఉంది.
  • శ్రీ మహావిష్ణువు పది అవతారాల్లో చివరిది కల్కి. ఆయన జన్మించబోయే పవిత్ర ప్రదేశమే శంబల అని రాసి ఉంది.
  • దేవతలు భూలోకంలో సంచరించే ప్రాంతంగా శంబలకు పేరు ఉంది.
  • 13వ దలైలామా తన గురువు తాషీలామాతో కలసి తాళపత్ర గ్రంధాల్లో రాసిన ఎన్నో రహస్య విషయాల్లో శంబల గురించి కూడా ఉంది.’శంబలకు వెళ్లే దారి’ అనే పేరుతో తాషీలామా ఓ గ్రంధాన్ని రచించారు.
  • శంబలలో వయసుని స్తంభింపజేసి నిత్యయవ్వనాన్ని ప్రసాదించే ఆయుర్వేద వనమూలికలు ఉన్నాయి. అక్కడున్న యోగులలో అద్భుతమైన శక్తులున్నాయని  తాషీలామా రాసిన గ్రంధంలో ఉంది.
  • రష్యన్ చిత్రకారుడు నికోలస్ రోయిచ్ కులు ప్రాంతంలో ఆశ్రమం నిర్మించుకుని ఉండిపోయాడు. ఆయన మరణించే వరకూ శంబల గురించి అన్వేషిస్తూనే ఉన్నాడు. శంబలకు వెళ్లే దారిని ఆయన ఓ చిత్రంలో రహస్యంగా చిత్రీకరించాడని..ఆయన గీసిన బొమ్మలన్నీ నిశితంగా గమనిస్తే ఈ విషయం తెలుస్తుందని చెబుతారు.
  • రోరిచ్ రాసిన పుస్తకాలు, గీసిన బొమ్మలను చూసిన తర్వాత శంబలపై హిట్లర్ కి ఆసక్తిపెరిగింది. దాని గురించి తెలుసుకోవాలి అనుకుని తన గూఢచారులను పంపించాడు. కానీ శంబల గురించి ఏ వివరాలు తెలుసుకోలేకపోయాడు.
  • రష్యాకు చెందిన హెలీనా అనే సాహసి కూడా తన రాసిన పుస్తకాల్లో శంబల గురించి ప్రస్తావించారు.

Also Read :Amarnath Yatra : గుడ్ న్యూస్.. జూన్ 29 నుంచి అమర్‌నాథ్ యాత్ర

  Last Updated: 23 Jun 2024, 07:54 AM IST