Laddu Prasadam : తిరుమలలో లడ్డు ప్రసాదం ఎప్పుడు మొదలుపెట్టారో తెలుసా..?

Laddu Prasadam : 1715 ఆగస్టు 2న శ్రీవారి లడ్డూ ప్రసాదం‌ తయారు చేసినట్లు చెబుతుంటే.. క్రీ.శ.1803లో బూందీగా పరిచయమైన అటు తరువాత 1940 నాటికి లడ్డూ ప్రసాదంగా స్ధిర పడినట్లు కొందరు పండితులు భావిస్తారు

Published By: HashtagU Telugu Desk
Tirupati Laddu

Tirupati Laddu

తిరుమల లడ్డు ప్రసాదం (Tirumala Laaddu Prasadam) అంటే ఒక అమృతం, అద్భుతం. స్వయంగా శ్రీవారే అనుగ్రహించే ప్రసాదమని భక్తుల విశ్వాసం. శ్రీవారిని మాత్రమే కాదు శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని తెచ్చుకోవాలని కూడా చాలామంది భక్తులు తిరుమలకు వెళ్తుంటారు. శ్రీవారికి ఎంతటి విశిష్టత ఉందో తిరుమల లడ్డూకు కూడా అంతే ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉంది. తిరుమల లడ్డు అంటే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. అలాంటి లడ్డు ప్రసాదం ఇప్పుడు వివాదాల్లో నిలిచింది.

తిరుమల లడ్డు (Tirumala Laddu) ప్రసాదంలో నెయ్యి (Pure Ghee)కి బదులు జంతువుల కొవ్వు , (Animal Fat ) వాడారని సీఎం చంద్రబాబు (Chandrababu) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. దీనిపై రెండు రోజులుగా యావత్ హిందువులు, రాజకీయేతర పార్టీల నేతలు జగన్ పై నిప్పులు చెరుగుతున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం అలాంటిదేమి అంటూ ప్రమాణాలకు సిద్ధం అంటున్నారు. మరి ఈ వివాదంలో ఎవరి మాట నిజం అనేది తెలియాల్సి ఉంది.

లడ్డు వివాదం నేపథ్యంలో ప్రతి ఒక్కరు తిరుమలలో లడ్డు ప్రసాదం ఎప్పుడు స్టార్ట్ చేసారు..? ఎవరు స్టార్ట్ చేసారు..? ఎంత సైజు లో ఉండేది..? ఎంత ధర ఉండేది..? ఎవరు తయారు చేసేవారు..? ఇలా అనేక రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఈ లడ్డూలను స్వామి వారి ప్రసాదంగా పెట్టడం ప్రారంభించి సరిగ్గా 309 ఏళ్లు పూర్తి అయ్యింది. 1715 ఆగస్టు 2న శ్రీవారి లడ్డూ ప్రసాదం‌ తయారు చేసినట్లు చెబుతుంటే.. క్రీ.శ.1803లో బూందీగా పరిచయమైన అటు తరువాత 1940 నాటికి లడ్డూ ప్రసాదంగా స్ధిర పడినట్లు కొందరు పండితులు భావిస్తారు. మొదట్లో లడ్డూ ప్రసాదాన్ని ఎనిమిది నాణేలకే ఇచ్చేవారని, అటు తరువాత 2, 5, 10, 15, 25 నుంచి ప్రస్తుతం 50 రూపాయలకు టిటిడి విక్రయిస్తోంది. 1940 వ సంవత్సరాన్ని‌ ప్రామాణికంగా తీసుకుంటే మాత్రం లడ్డూ వయస్సు 83 సంవత్సరాలు అవుతుందని కొందరు చెబుతారు. లడ్డూకు పేటేంట్, ట్రేడ్ మార్క్ కూడా ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు. పల్లవుల కాలం నుంచే ప్రసాదాలు చరిత్రక ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.. విజయనగర సామ్రాజ్యంలోని రెండవ దేవరాయలు కాలం నుంచి ప్రసాదాల సంఖ్య మరింత ఎక్కువ పెంచినట్టు పూర్వికులు చెపుతున్నారు. శ్రీవారి ఆలయంలో లడ్డూల తయారీకి వాడవలసిన సరుకుల మోతాదును ‘దిట్టం’ అంటారు. దీనిని తొలిసారిగా టీటీడీ పాలక మండలి 1950 లో నిర్ణయించింది. పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా దిట్టాన్ని పెంచుతూ వచ్చారు.

శ్రీవారి లడ్డూ తయారిలో వాడే దిట్టంలో వాడే సరుకులు దీని ప్రకారం 5100 లడ్డూల తయారీకి 803 కేజీల సరుకులు వినియోగిస్తారు.

ఆవు నెయ్యి – 165 కిలోలు

శెనగపిండి – 180 కిలోలు

చక్కెర – 400 కిలోలు

యాలుకలు – 4 కిలోలు

ఎండు ద్రాక్ష – 16 కిలోలు

కలకండ – 8 కిలోలు

ముంతమామిడి పప్పు -30 కిలోలు

ఈ మిశ్రమంలో సుమారు 5,100 లడ్డూలు వరకూ తయారవుతాయి.శ్రీవారి ఆలయం ఆగ్నేయదిక్కులో ఉన్న వంటశాలలో సుమారు 15000 వరకూ లడ్డూలు తయారవుతాయి.తొలి రోఅజుల్లో లడ్డూలను కట్టెలపొయ్యి మీద తయారుచేసేవారు.అయితే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని యంత్రాలను ప్రవేశపెట్టారు. తిరుమలలో లడ్డూ తయారీ కోసం పోటు అనే వంటశాల ఉంది. ఇక్కడ అత్యాధునికమైన వంట సామగ్రి సహాయంతో రోజూ లక్షల లడ్లు తయారీ జరుగుతున్నది. అలాంటి లడ్డు ఇప్పుడు వివాదంలో నిలిచింది. మరి నిజంగా లడ్డు తయారీలో జంతువుల కొవ్వు వాడారా..? లేదా..? అనేది వాస్తవాలు తెలియాల్సి ఉంది.

Read Also :  Laddu Controversy : శ్రీవారి పవిత్రతను దెబ్బతీశారు..చంద్రబాబుకు బండి సంజయ్‌ లేఖ..!

  Last Updated: 20 Sep 2024, 03:02 PM IST