Lord Krishna – Arjuna : శ్రీకృష్ణుడి నిర్యాణం తర్వాత ఏం జరిగిందంటే ?

Lord Krishna - Arjuna: మహాభారత యుద్ధం తరువాత హస్తినాపుర రాజభవనానికి తిరిగొచ్చిన శ్రీకృష్ణుడిని చూడగానే.. గాంధారి కోపంతో మాట్లాడటం మొదలు పెడుతుంది.

Published By: HashtagU Telugu Desk
Sri Krishna

Sri Krishna

Lord Krishna – Arjuna: మహాభారత యుద్ధం తరువాత హస్తినాపుర రాజభవనానికి తిరిగొచ్చిన శ్రీకృష్ణుడిని చూడగానే.. గాంధారి కోపంతో మాట్లాడటం మొదలు పెడుతుంది. తన 100 మంది కుమారులైన కౌరవులను రక్షించడానికి ఏమీ చేయలేదని మండిపడుతుంది. కొడుకులను కోల్పోయిన బాధలో ఉన్న గాంధారి.. ‘యాదవ వంశం నాశనమైపోతుంది’, ‘ద్వారక నాశనం కావాలి’ అని శ్రీకృష్ణుడిని శపిస్తుంది. గాంధారి శాపం కారణంగా.. కొంతకాలం తర్వాత ఓ ఘటనలో శ్రీకృష్ణుడు నిర్యాణం చెందుతాడు.  దీంతో యాదవ వంశం మొత్తం నశిస్తుంది. శ్రీకృష్ణుడి ద్వారక సముద్రంలో మునిగిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది ? అర్జునుడు ఏమయ్యాడు ?

We’re now on WhatsApp. Click to Join

గాంధారి శాపం తర్వాత శ్రీకృష్ణుడు దట్టమైన అడవికి వెళ్లి అక్కడ తపస్సు చేయడం మొదలుపెడతాడు. కొంతకాలం అనంతరం ద్వారకలో శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడు ప్రాణం వదిలాడు. ఈవిషయాన్ని శ్రీకృష్ణుడికి చెప్పేందుకు అర్జునుడు తపోవనానికి బయలుదేరుతాడు. తపోవనమంతా రెండురోజులు కాళ్లరిగేలా తిరుగుతాడు. వెతగ్గా.. వెతగ్గా ఒకచోట శ్రీకృష్ణుడు కనిపిస్తాడు. అది కూడా నిర్యాణ దశలో ! దీంతో అర్జునుడు వెక్కివెక్కి ఏడుస్తాడు. అయితే ఆ అరణ్యంలో బోయవాడి బాణం కాల్లో దిగడం వల్ల  శ్రీకృష్ణుడు తన దేహాన్ని విడిచి 4-5 రోజులు గడిచాయి. దీంతో అక్కడే అర్జునుడు అంత్యక్రియలు పూర్తిచేస్తాడు. ఆ తర్వాత అర్జునుడు తన శక్తులన్నింటినీ కోల్పోయి, సాధారణ పౌరుడిగా మిగిలిపోతాడు. అయినప్పటికీ.. శ్రీకృష్ణుడి 16,100 మంది భార్యలతో సహా ద్వారకలోని పౌరులందరినీ తన ఇంద్రప్రస్థానికి (Lord Krishna – Arjuna) తీసుకెళ్తాడు.

Also read : Fake Currency Notes : ఏకంగా ఆర్బీఐకి చేరిన నకిలీ నోట్లు.. ఎలా ?

గమనిక: ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.

  Last Updated: 10 Oct 2023, 05:46 PM IST