Site icon HashtagU Telugu

Temple Tips : ప్రతి రోజు గుడికి వెళితే జీవితంలో ఎటువంటి మార్పులు వస్తాయో మీకు తెలుసా?

Do You Know What Changes In Life Can Happen If You Go To Temple Every Day..

Do You Know What Changes In Life Can Happen If You Go To Temple Every Day..

Changes in Life if you go to the Temple Every Day : మామూలుగా పండుగల సమయంలో ప్రత్యేకమైన సందర్భాలలో అలాగే నిత్య దీపారాధన చేసేవారు ఆలయాలకు వెళుతూ ఉంటారు. కొంతమంది ప్రతి రోజు దేవాలయాలకు వెళ్తూ ఉంటారు. అయితే అలా ప్రతిరోజు గుడికి (Temple) వెళ్తే ఏం జరుగుతుంది? అలా ప్రతిరోజు గుడికి (Temple) వెళ్లడం వల్ల జీవితంలో ఏదైనా మార్పులు వస్తాయా? ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

శాస్త్రం ప్రకారం, ప్రతిరోజూ ఆలయాన్ని సందర్శించడం వల్ల ఆరోగ్యం, శ్రేయస్సు లభిస్తుంది. రోజూ ఉదయాన్నే గుడికి (Temple) వెళితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. హిందూ విశ్వాసం ప్రకారం, బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసిన తర్వాత ఆలయాన్ని సందర్శించడం ద్వారా బ్రహ్మ జ్ఞానం లభిస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

దీని కారణంగా, వ్యక్తి మానసిక అభివృద్ధితో ఏకాగ్రత పెరుగుతుంది. నిత్యం ఆలయానికి వెళితే ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందని చాలా మంది విశ్వాసం. రోజు ఆలయాన్ని సందర్శించడం వల్ల మనకు క్రమశిక్షణ, స్వీయ నిగ్రహాన్ని నేర్పుతుంది. మీరు ఆలయాన్ని సందర్శించడానికి ఒక నిర్దిష్ట స‌మ‌యం లేదా రోజును కేటాయించినప్పుడు అది మీ జీవితంలో క్రమశిక్షణ పాఠంగా మారుతుంది. దేవాలయానికి వెళ్ళేటప్పుడు పేదలకు, అభాగ్యుల‌కు అన్నదానం చేయడంతో పాటు ఆల‌యంలో భ‌గ‌వంతుని విగ్రహం ముందు నమస్కరించడం, వ్యక్తిలోని అహంకారాన్ని నాశనం చేస్తుంది. దేవాలయానికి వెళ్లడం అనేది దేవుడు మిమ్మల్ని చూస్తాడు మీ మాట వింటాడు అనే విశ్వాసానికి ఆధారమ‌ని మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు.

మనసులో ఈ అనుభూతిని పొందే వ్యక్తి భగవంతుని పట్ల భయాన్ని కూడా పొందుతాడు. మీరు మంచి పనులు చేయడానికి ప్రేరణ పొందుతారు, ప్రతి ప‌నిని ధర్మ మార్గంలో చేస్తారు. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు కాబట్టి మీరు తప్పులు చేయడానికి వెనుకంజ వేస్తారు. దేవుని గదిలో లేదా గుడిలో ఉన్న దేవుని విగ్రహం మనిషికి భగవంతునితో సంభాషించడానికి మంచి మాధ్యమం అవుతుంది. మనిషి మనస్సులో భగవంతుని పట్ల ఉన్న భక్తిని విగ్రహం ముందు చూపుతారు. ఇలా చేయడం వల్ల చాలా మందిలో సానుకూల దృక్ప‌థం పెరుగుతుంది. విగ్రహం ద్వారా భక్తులు భగవంతుని అనుగ్రహాన్ని, దైవిక శక్తి ప్రకంపనలను పొందుతారు.

అలాగే మనం గుడికి వెళ్లినప్పుడు, నేలపై కూర్చొని, మౌనంగా ధ్యానం చేయడం, గ్రంధాలను చదవడం, భగవంతుడిని పూజించే ఆచారాలలో నిమగ్నమై ఉండటం చాలా మంది వ్యక్తులపై వినయపూర్వకమైన, ప్రశాంతమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇది ఒక వ్యక్తిలో శాంతి భావనను సృష్టిస్తుంది. దేవాలయం అంటే చాలా మంది వచ్చి తమ కుటుంబాల కోసం తమ శ్రేయస్సు కోసం ప్రార్థించే ప్రదేశం. ఏ వ్యక్తి అయినా దేవుని ముందు నిలబడి తన బాధలు చెప్పుకొని ప్రార్థనను ప్రారంభిస్తాడు. కొంత సమయం తరువాత, వ్యక్తి ఆలయంలో సానుకూల ప్రకంపనలను అనుభవిస్తాడు.

Also Read:  Sabarimala: శబరిమలలో భక్తుల రద్దీ, తొక్కిసలాటలో ఒకరు మృతి