Kabirdas -Social Reformer : మూఢనమ్మకాలపై యుద్ధం చేసిన కబీర్ దాస్

కాశీ నగరంలో మరణించిన వ్యక్తి స్వర్గాన్ని పొందుతాడని, మగహర్ లో మరణించిన వ్యక్తి  నరకం అనుభవించాల్సి ఉంటుందని కూడా ఒక మూఢ నమ్మకం(Kabirdas -Social Reformer) ఉండేది.

  • Written By:
  • Publish Date - June 4, 2023 / 07:36 AM IST

కబీర్ దాస్..

ఆయన సాధువు మాత్రమే కాదు.. గొప్ప ఆలోచనాపరుడు, సంఘ సంస్కర్త కూడా..

సమాజంలోని దురాచారాలను తొలగించేందుకు జీవితాంతం ఎన్నో ద్విపదలు, పద్యాలు రచించారు..

చెడులను, మూఢనమ్మకాలను నిత్యం ఖండించారు..  

కబీర్ దాస్ తన ద్విపదల ద్వారా జీవితాన్ని ఎలా గడపాలనే గొప్ప సందేశాన్ని ఇచ్చారు..

నేటికీ ప్రజల నోళ్ళలో ఆ ద్విపదలు నానుతుంటాయంటే.. అవి ఎంత బాగుంటాయో అర్థం చేసుకోవచ్చు.   

ఇవాళ (జూన్ 4) ఆ మహామహుడి జయంతి సందర్భంగా కథనమిది..

ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి రోజున కబీర్‌దాస్ జయంతిని జరుపుకుంటారు. క్రీస్తు పూర్వం 1398లో ఆయన జన్మించారు. కబీర్ జీ పుట్టుక, మతంపై పలు భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఆయన పుట్టుకతో  బ్రాహ్మణుడని కొందరు అంటే.. ముస్లిం అని ఇంకొందరు అంటారు.  ఏది ఏమైనా ఆయన సమాజ ఉద్ధరణకు(Kabirdas -Social Reformer) ఆనాడే అలుపెరుగని కృషి చేశారు అనేది స్పష్టం.  అప్పట్లో సమాజంలో అనేక రకాల మూఢ నమ్మకాలు ఉండేవి. కాశీ నగరంలో మరణించిన వ్యక్తి స్వర్గాన్ని పొందుతాడని, మగహర్ లో మరణించిన వ్యక్తి  నరకం అనుభవించాల్సి ఉంటుందని కూడా ఒక మూఢ నమ్మకం(Kabirdas -Social Reformer) ఉండేది. అయితే ప్రజలలో వ్యాపించిన ఈ మూఢ నమ్మకాన్ని తొలగించడానికి కబీర్ జీ తన జీవితమంతా కాశీలో నివసించారు. చివరికి తన మగహర్ కు బయలుదేరి మగహర్ లోనే తుదిశ్వాస విడిచారు.

Also read : International Human Rights Day: మనిషిగా మీకు ఉన్న హక్కులు?

అంత్యక్రియల్లో అద్భుతం..

అద్భుతాలు అనేవి సామాన్యులకు జరగవు.. మహానుభావులకు మాత్రమే జరుగుతాయి.  అందుకే సామాన్యులు.. ఆ అద్భుతాల విలువను గ్రహించలేరు.. వాటిని విశ్వసించలేరు. ఇలాంటి ఒక అద్భుతమే కబీర్‌దాస్ తుదిశ్వాస విడిచాక జరిగింది.  కబీర్ జీని ఫాలో అయ్యే వారిలో అన్ని మతాలవారు ఉన్నారు. అందుకే అప్పట్లో  ఆయన మరణించినప్పుడు..  అంత్యక్రియల విషయంలో హిందువులు, ముస్లింల మధ్య వివాదం ఏర్పడిందని చెబుతారు. ఈ వివాదం నడుమ కబీర్‌దాస్ పార్థివ దేహం పై నుంచి షీట్‌ను తీసేయగా.. అందులో పూలు మాత్రమే కనిపించాయని చెబుతారు. హిందూ, ముస్లిం వర్గాల  ప్రజలు ఈ పువ్వులను తమతో తీసుకెళ్లి.. వారి మతం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారని అంటారు.

గమనిక  : ‘ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.