Somnath Temple: తాజాగా గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో ఉన్న ప్రఖ్యాత జ్యోతిర్లింగ క్షేత్రం సోమనాథ్ దేవాలయాన్ని ప్రధాని మోడీ దర్శించుకున్నారు. ఈసందర్భంగా సోమనాథ లింగానికి ప్రత్యేక పూజలు చేశారు. సోమనాథ్ దేవాలయానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. పురాణాల్లోనూ దీని ప్రాశస్త్యం గురించి ప్రస్తావన ఉంది. ఆ విశేషాలను తెలుసుకుందాం..
Also Read :Sarojini Naidu : తెలుగు వీర వనిత సరోజినీ నాయుడు.. నిజాం నవాబు మెచ్చిన రచయిత్రి !
సోమనాథ్ ఆలయానికి చంద్రుడితో అనుబంధం
- గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతంలో వెరావల్ ఓడరేవు సమీపంలో సోమనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది.
- దీన్ని స్వయంగా చంద్రుడే నిర్మించాడని నమ్ముతారు.
- సోమనాథుడు(Somnath Temple) అనే పేరులోని సోమ అంటే చంద్రుడు , నాథ అంటే ప్రభువు. సోమనాథ అంటే చంద్రునికి ప్రభువు అని అర్ధం.
- మామ దక్ష ప్రజాపతి చంద్రుడిని శపిస్తాడు. దీంతో ఆయన ప్రకాశం తగ్గడం ప్రారంభిస్తుంది. దీంతో శాప విముక్తి కోసం చంద్రుడు బ్రహ్మదేవుని సలహాతో గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతంలో ఉన్న సముద్ర తీరానికి వెళ్లి శివలింగాన్ని ప్రతిష్టించి పూజిస్తాడు. శివుడు ప్రత్యక్షమై చంద్రుడికి శాపం నుంచి విముక్తిని కలిగించాడు. చంద్రుడికి అమరత్వం ప్రసాదిస్తాడు.
- శాప విముక్తి అనంతరం చంద్రుడు తాను చేసిన శివలింగంలో నివసించమని శివుడిని ప్రార్థిస్తాడు. అందుకు శివుడు అంగీకరించి భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. నాటి నుంచే సోమనాథ్ శివలింగాన్ని జ్యోతిర్లింగంగా పూజిస్తున్నారు.
- శివుడికి చంద్రుడు బంగారు ఆలయాన్ని నిర్మించాడట. తర్వాతి కాలంలో ఈ ఆలయాన్ని రావణుడు వెండితో, శ్రీకృష్ణుడు చెక్కతో, పాండవుల్లో ఒకరైన భీముడు రాతితో నిర్మించారనే జానపద కథలు ప్రచారంలో ఉన్నాయి.
- చంద్రుడిపై శివుడు అనుగ్రహం చూపాడు అందుకే ఆయన్ను “సోమనాథుడు” అని కూడా పిలుస్తారు.
- సోమనాథ్ ఆలయం ఎందుకు స్పెషల్ అంటే.. అది జ్యోతిర్లింగ క్షేత్రం.
- మన దేశంలో 12 జ్యోతిర్లింగ క్షేత్రాలు ఉన్నాయి. వీటిని శివుని శక్తి రూపాలుగా భావిస్తారు.
Also Read :Oscars 2025 : ఆస్కార్ అవార్డుల్లో ‘వికెడ్’, ‘అనోరా’ హవా.. విజేతలు వీరే
మూలరాజు.. మహమ్మద్ గజినీ..
- చాళుక్య రాజు మహారాజా మూలరాజు 9వ శతాబ్దం (997 CE)లో సోమనాథ్ ఆలయాన్ని నిర్మించారు.
- ఈఆలయంలో శమంతక మణి ఉండేదట. అదొక అద్భుత రత్నం. దాన్ని తాకిన ప్రతిదీ బంగారంగా మారిపోతుందట. ఈ శమంతక మణిని జ్యోతిర్లింగం బోలు లోపల దాచారని అంటారు.
- ఈ ఆలయం శిఖరంపై 37 అడుగుల పొడవైన జెండా ఉంటుంది. ఆలయ సిబ్బంది ఈ జెండాను ప్రతిరోజు మూడు సార్లు మారుస్తారు.
- సరస్వతి, కపిల, హిరాన్ అనే మూడు నదుల పవిత్ర సంగమంగా సోమనాథ్ ఆలయానికి ప్రాశస్త్యం ఉంది.
- 1026లో మహమ్మద్ గజినీ సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసి అక్కడున్న సంపదను దోచుకెళ్లాడు.
- మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ ఆలయాన్ని ‘మారు-గుర్జారా శైలి’లో పునర్నిర్మించారు. 1951లో దీని పునర్నిర్మాణం పూర్తయింది.