Site icon HashtagU Telugu

Hibiscus : ‘మందార మొక్క’ కూడా ఆర్ధిక సమస్యల నుండి బయటపడేస్తుందని మీకు తెలుసా..?

Hibiscus

Hibiscus

మందార మొక్క (Hibiscus )..ఒకప్పుడు ఏ ఇంట్లో చూసిన ఈ మొక్క కనిపించేది..కానీ ఈ మధ్య ఈ మొక్కను నాటడం బాగా తగ్గించేశారు. ఎంతసేపు గులాబీ , అందంగా కనిపించే షో మొక్కలు పెంచుతున్నారు తప్ప మందార మొక్కను పెంచడం లేదు. అసలు చాలావరకు ఈ మొక్క కనిపించడం లేదు. అయితే ఈ మొక్క మీ కుటుంబ ఆర్ధిక సమస్యల నుండి బయటపేస్తుందని మీకు తెలుసా..?

We’re now on WhatsApp. Click to Join.

అదేలా అనుకుంటున్నారా..? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.

ప్రతి ఇంటికి వాస్తు అనేది చాల ముఖ్యం. మనలని ఉన్నత స్థాయికి చేర్చేది వాస్తే..పడగొట్టేది కూడా వాస్తే. అందుకే ప్రతి ఒక్కరు ఏంచేసినా వాస్తు ప్రకారమే చేస్తుంటారు. అలాంటి వాస్తు లో భాగం..మందార మొక్క. ఈ మొక్కను ఇంట్లో సరైన దిశలో నాటితే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని వాస్తు నిపుణులు చెపుతున్నారు. మరి ఈ మొక్కను ఏ దిశలలో నాటాలో చూద్దాం.

* తూర్పు దిశ శుభప్రదం : ఇంటికి ఉత్తమ దిశలో మందార మొక్కను నాటితే అనేక ప్రయోజనాలు ఉంటాయి. అంటే మొక్కను తూర్పు ముఖంగా నాటాలి. అప్పుడే ఇంటికి శుభం జరుగుతుంది. అలాగే లక్ష్మీదేవిని మందార పువ్వులతో పూజిస్తే ప్రయోజనం ఉంటుంది. పూజ సమయంలో లక్ష్మీదేవికి ఎర్ర మందార పుష్పాలు సమర్పించాలి. ఫలితంగా కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే ఇంట్లో నిత్యం డబ్బులు ఉంటాయి.

అలాగే ఇంట్లో మందార మొక్కను పెంచితే బంధాలు బలపడతాయి. కుటుంబంలో గొడవలు సద్దుమణిగి సంతోషంగా ఉంటారు. దాంపత్య జీవితం కూడా సాఫీగా సాగుతుంది. పూజ సమయంలో, మందార పువ్వులను దుర్గాదేవి, లక్ష్మీదేవి, ఆంజనేయ స్వామికి సమర్పిస్తే మంగళ దోషాలు తొలగిపోతాయి. ఇంట్లో డబ్బుకు, ఆహారానికి కొరత ఉండదు. దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ వివాదాలను నివారించడానికి ఇంటి ప్రాంగణంలో మందార మొక్కను నాటాలి. ఇది సానుకూల శక్తి ప్రవాహాన్ని పెంచుతుంది. ఫలితంగా ఇంట్లో ప్రశాంతమైన, సంతోషకర వాతావరణం ఉంటుంది.ఇక వ్యాపారంలో సమస్యలు ఎదురువుతుంటే ఇంట్లో మందార మొక్కను నాటాలని చెపుతున్నారు. సో మీరు కూడా మీ ఇంట్లో మందార మొక్క నాటి ఆర్ధిక సమస్యల నుండి బయట పడండి.

Read Also : Floating Bridge : వైజాగ్‌ బీచ్‌లో ‘ఫ్లోటింగ్ బ్రిడ్జ్‌’.. ప్రత్యేకతలు ఇవిగో