Vastu And Money: వాస్తు ప్రకారం డబ్బును ఏ దిశలో దాచాలో తెలుసా..?

ఇంట్లో డబ్బును బీరువాలో కానీ… పెట్టెలో కానీ దాచుకుంటాం. అయితే వాస్తు ప్రకారం డబ్బును ఏ దిశలో దాచుకోవాలో తెలుసా? చాలాసార్లు ఇంట్లో డబ్బు దాచిపెట్టినప్పటికీ… మనకు కలిసి రాదు. వ్యాపారంలో నష్టాలు రావడం… దోపిడీకి గురికావడం జరుగుతుంటాయి. దీనికి కారణం మనం వాస్తు ప్రకారం డబ్బును సరైన దిశలో దాచకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. డబ్బును ఈ దిశలో ఉంచకూడదు… వాస్తు ప్రకారం… డబ్బు, విలువైన పత్రాలు, ఆభరణాలు దాచుకునే బీరువా లేదా పెట్టెను […]

Published By: HashtagU Telugu Desk
Do you know in which direction money should be kept according to Vastu?

Do you know in which direction money should be kept according to Vastu?

ఇంట్లో డబ్బును బీరువాలో కానీ… పెట్టెలో కానీ దాచుకుంటాం. అయితే వాస్తు ప్రకారం డబ్బును ఏ దిశలో దాచుకోవాలో తెలుసా? చాలాసార్లు ఇంట్లో డబ్బు దాచిపెట్టినప్పటికీ… మనకు కలిసి రాదు. వ్యాపారంలో నష్టాలు రావడం… దోపిడీకి గురికావడం జరుగుతుంటాయి. దీనికి కారణం మనం వాస్తు ప్రకారం డబ్బును సరైన దిశలో దాచకపోవడం కూడా ఒక కారణం కావచ్చు.

డబ్బును ఈ దిశలో ఉంచకూడదు…

వాస్తు ప్రకారం… డబ్బు, విలువైన పత్రాలు, ఆభరణాలు దాచుకునే బీరువా లేదా పెట్టెను పశ్చిమం లేదా వాయువ్య దిశలో ఉంచకూడదు. ఈ దిశలో దాచితే ధన నష్టం, దొంగతనం జరిగే అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు. వాస్తులో వాయువ్య దిశ అనేది డబ్బుకు సంబంధించి మంచిది కాదు.

ఈ దిశలో డబ్బు ఉంచడం మంచిది…

వాస్తు ప్రకారం… డబ్బును ఎల్లప్పుడూ నైరుతి దిశలోనే ఉంచాలి. అప్పుడు దొంగతనాల భయం ఉండదు. ఈ దిశలో డబ్బును దాచిపెట్టినప్పుడు… అక్కడ కిటికీలు, తలుపులు ఉండకూడదు.

ముఖ్యంగా ఉత్తర గోడ, పడమటి గోడ రెండూ కలిసిన మూల అయిన వాయువ్య దిశలో బీరువా పెడితే మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులుa చెబుతున్నారు. ఉత్తర దిశ వైపు బీరువా వెనుక భాగం చూసే విధంగా డబ్బులు, నగలు పెడితే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తూ.. పోతుందట.

నైరుతి మూలలో బీరువాలో డబ్బులు, నగలు పెడితే ఇబ్బందులు తప్పవు. అంతేకాదు నగలు, డబ్బులు పెరగవని, జీవితంలో ఆర్థిక వృద్ధి ఉండదని చెబుతున్నారు. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలంటే బీరువాను సరైన స్థానంలో పెట్టడంతో పాటు… కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. డబ్బును నిర్లక్ష్యంగా ఎక్కడపడితే అక్కడ పెట్టకూడదని వాస్తుశాస్త్రం చెబుతోంది.

వాస్తు ప్రకారం నిర్దేశించిన దిక్కులలో ధనాన్ని పెడితే… ధనం వృద్ధి చెందుతుంది. ఇంట్లో సంతోషంగా ఉంటారు. ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి కటాక్షం పొందవచ్చని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

  Last Updated: 13 Jun 2026, 03:51 PM IST