Ravana Vs Curses List :  రావణుడిని వెంటాడి వేటాడి చంపిన శాపాలివే

Ravana Vs Curses List : రావణుడిని ఆ శాపాలే వెంటాడి, వేటాడి దహించాయి. 

  • Written By:
  • Updated On - July 4, 2023 / 04:39 PM IST

Ravana Vs Curses List : రావణుడు.. 

ఇతడిని రావణ బ్రహ్మ‌ అని కూడా  పిలుస్తారు.. 

రావణుడికి రకరకాల మంత్రాలు, తంత్రాలు, ఇంద్రజాలం, వశీకరణ విద్యలు తెలుసని అంటారు.

ఎంతో విజ్ఞానం ఉన్నా.. వివేకం, విచక్షణ రావణుడికి లోపించాయి. 

అందుకే ఎంతో మంది స్త్రీలను, ఋషులను అవమానించి వారి శాపాలను మూట కట్టుకున్నాడు. 

ఆ శాపాలే అతడిని వెంటాడి, వేటాడి దహించాయి. 

విర్రవీగాడు.. హేళనగా మాట్లాడాడు 

బ్రహ్మదేవుడి వరం పొందిన తర్వాత  రావణుడు విర్రవీగాడు.. తన శక్తితో ముల్లోకాలను బాధించడం మొదలు పెట్టాడు. క్రూరుడిగా మారిపోయి ఋషులను, యక్షులను చంపసాగాడు. చివరకు తన సోదరుడు కుబేరుడిని జయించి.. అతడి దగ్గరున్న  పుష్పక విమానాన్ని కూడా  లాక్కుంటాడు. కైలాస గిరి ప్రాంతంలో నందీశ్వరుడిని చూసి.. కోతితో పోల్చి హేళనగా మాట్లాడుతాడు. దీంతో కోపించిన నందీశ్వరుడు..  కోతులతో ఓడిపోతావని రావణుడిని శపిస్తాడు.

వేదవతి శాపం నిజమైంది

కామంతో కళ్లు మూసుకుపోయిన రావణుడు బరితెగించాడు. విష్ణు మూర్తి కోసం తపస్సు చేస్తున్న వేదవతిని తల వెంట్రుకలు పట్టుకుని లాగుతాడు. దీంతో కోపించిన వేదవతి .. ఒక  స్త్రీ కారణంగా నాశనమవుతావని(Ravana Vs Curses List) శపిస్తుంది. అనంతరం ఆమె అగ్నిప్రవేశం చేస్తుంది. ఆ వేదవతే, జనక మహారాజు కూతురై భూమిలో పుట్టి సీత పేరుతో శ్రీరాముడిని వివాహమాడింది అని అంటారు.

Also read :Thailand decision on Sri Lanka Elephant : శ్రీలంక నుండి థాయ్‌ ఏనుగు మరలా థాయిలాండ్‌ కు.

నాలుగో శాపం పవర్ ఫుల్.. 

మరుత్తు అనే రాజు యజ్ఞం చేస్తుంటే రావణుడు అక్కడికి వెళ్లి మునులందరినీ చంపుతాడు. అయోధ్యకు వెళ్లి అనరణ్యుడిని యుద్ధంలో ఓడిస్తాడు.. దీంతో కోపించిన అనరణ్యుడు.. “దశరథ మహారాజు కుమారుడు రాముడి చేతిలో నీకు చావు తప్పదు” అని రావణుడిని శపిస్తాడు. ఇది రావణుడికి నాలుగో శాపం. యముడిపై, వరుణ దేవుడి తనయులపై యుద్ధం  ముగిసిన అనంతరం లంకా నగరానికి రావణుడు బయల్దేరుతాడు.  మార్గం మధ్యలో రాజ స్త్రీలు, ముని కన్యలపై  బలాత్కారం చేస్తాడు. వారందరినీ పుష్పక విమానంలో పడేస్తాడు. దీంతో వారంతా రావణుడిని శపించారు. తామే పతివ్రతలమైతే..  రావణుడు పర స్త్రీ కారణంగానే చంపబడతాడని శపించారు.

రంభ భర్త శాపం.. 

దేవతల మీదకు దండయాత్రకు వెళ్ళిన సందర్భంలో దేవలోకంలోని రంభను చూసి ఆమె చేయి పట్టుకుంటాడు. తన మీద దయ చూపాలని, నవ్వుల పాలు చేయవద్దని రంభ  వేడుకుంటుంది. అయినా వినకుండా రావణుడు  అఘాయిత్యానికి పాల్పడతాడు.  రావణుడు చేసిన పనిని భర్త నలకూబరుడి(కుబేరుడి కొడుకు) తో రంభ చెప్తుంది. ఇంకోసారి పర స్త్రీని చెరిస్తే  రావణుడు మరణిస్తాడని నలకూబరుడు శపిస్తాడు.

గమనిక: ‘ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.