PitruPaksha Amavasya : హిందువులు తమ పూర్వీకులకు నివాళులు అర్పించే పితృపక్ష అమావాస్య ఈరోజే (అక్టోబర్ 14న). మరణించిన పితృదేవతలను పూజించుకోవడం అనేది హిందూమతంలో ఒక ఆనవాయితీ. ఈ ఆనవాయితీల్లో అత్యంత ముఖ్యమైనది పితృపక్ష అమావాస్య. దీన్నే సర్వ పితృఅమావాస్య లేదా మహాలయ అమావాస్య అని కూడా పిలుస్తారు. ఇవాళ పూర్వీకుల మోక్షం కోసం పితృ తర్పణం చేస్తారు. ఇలా చేస్తే పూర్వీకుల ఆత్మ శాంతిస్తుందని, ఆ కుటుంబం వృద్ధి చెందుతుందని నమ్ముతారు. శనివారం కావడం.. అమావాస్య కూడా కలిసి రావడంతో ఈరోజు మరింత పవర్ ఫుల్ గా మారిందని పండితులు చెబుతున్నారు. వీటన్నింటికి తోడు ఇదే రోజు సూర్య గ్రహణం కూడా ఉంది. ఇంతకీ పితృ తర్పణం ఎప్పుడు చేస్తారు ? ఎలా చేస్తారు? దీని వల్ల కలిగే లాభాలేంటి? వంటి వివరాలను ఓసారి చూద్దాం.
We’re now on WhatsApp. Click to Join.
తిథి ప్రారంభం, ముగింపు..
వాస్తవానికి అక్టోబర్ 13వ తేదీ రాత్రి 9.50 గంటలకే పితృపక్ష అమావాస్య తిథి ఆరంభమైంది. ఈ తిథి ఈరోజు (అక్టోబర్ 14) రాత్రి 11:24 గంటల దాకా కొనసాగుతుంది. ఇక దీనికి సంబంధించిన కుతుప్ ముహూర్తం ఇవాళ ఉదయం 11:09 గంటల నుంచి రాత్రి 11:56 వరకు ఉంటుంది. రోహిణ ముహూర్తం ఈరోజు ఉదయం 11:56 గంటల నుంచి రాత్రి 12:43 వరకు ఉంటుంది. అపరహ్న కాలం ఈరోజు మధ్యాహ్నం 12:43 నుంచి రాత్రి 3:04 వరకు ఉంటుంది.
ఎలా ఆచరించాలి ?
పితృపక్షాన్ని చేయడానికి కొన్ని ఆచార వ్యవహారాలు ఉన్నాయి. కుటుంబంలోని పెద్ద కుమారుడు ఈ పూజ చేయాల్సి ఉంటుంది. ఇంటికి దక్షిణ దిశలో ఒక చెక్క బల్ల లేదా పీటను ఏర్పాటు చేసి దానిపై పూర్వీకుల ఫొటోలు ఉంచాలి. వాటి ముందు కొన్ని నల్ల నువ్వులు వేయండి. ఆ తర్వాత నెయ్యి, తేనె, బియ్యం, మేక పాలు, చక్కెరలను కలిపి పిండం తయారు చేయాలి. దీన్నే పితృదేవతలకు పిండ తర్పణం చేయడం(PitruPaksha Amavasya) అంటారు. పితృపక్షం రోజున పూర్వీకులను తలుచుకుని, వారి సేవలను గుర్తుచేసుకోవడం కనీస ధర్మం అని పండితులు చెబుతున్నారు.
Also Read: World Cup 2023 : కివీస్ హ్యాట్రిక్ విక్టరీ…బంగ్లాదేశ్ పై ఘనవిజయం
గమనిక: ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.