Vali – Sugriva : వాలి, సుగ్రీవుల పాత్రలు రామాయణంలో అత్యంత ఆసక్తికరమైనవి. వీరిద్దరూ సోదరులు. అయితే వాలి,సుగ్రీవుల తల్లిదండ్రులు ఎవరు ? వారి జన్మ వృత్తాంతం ఏమిటి ? అనే వివరాలు రామాయణంలోని ఉత్తరకాండలో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
We’re now on WhatsApp. Click to Join
బ్రహ్మదేవుడు మేరు పర్వతంపై యోగాభ్యాసం చేస్తున్న సమయంలో ఆయన కంటి నుంచి ఒక చుక్క నీరు నేలపై పడిందట. దాని నుంచి ఒక వానరుడు పుట్టాడు. అతడు బ్రహ్మ వద్దే ఉంటూ పగలంతా మేరు పర్వతం చుట్టుపక్కల ఉండే చెట్లపై తిరిగేవాడు. సాయంత్రం వేళ బ్రహ్మ వద్దకు పూలు, పండ్లు పట్టుకొని వచ్చి ఆయన్ను గౌరవించి వెళ్తుండేవాడు. కొంతకాలం తర్వాత ఓ రోజు మేరు పర్వతం అవతల ఉన్న ఒక సరస్సును వానరుడు చూశాడు. ఆ సరస్సులోకి వానరుడు తొంగిచూడగా.. అతడి ప్రతిబింబం అందులో కనిపించింది. దీంతో ఆ ప్రతిబింబాన్ని పట్టుకునేందుకు సరస్సులోకి వానరుడు దూకుతాడు. ఎంత వెతికినా సరస్సులో ఆ ప్రతిబింబం మాత్రం దొరకదు. దీంతో ఆ వానరుడు అలసిపోయి ఒడ్డుకు చేరుకుంటాడు. ఒడ్డుకు రాగానే అతడు అమ్మాయిలా మారుతాడు. తన ఆకారం మారడాన్ని గుర్తించిన వానరుడు .. బ్రహ్మ వద్దకు వెళ్లి తన పరిస్థితిని వివరిస్తాడు. ఆ సరస్సుకు ఉన్న శాపం వల్ల అలా జరిగిందని.. పిల్లలు పుట్టగానే తిరిగి మగ రూపం వచ్చేస్తుందని వానరుడికి బ్రహ్మ చెబుతారు.
Also Read :Rains Alert : నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాలకు వర్షసూచన
ఒకరోజు బ్రహ్మ దేవుడి వద్దకు వచ్చిన ఇంద్రుడు, సూర్యుడు.. అక్కడే కూర్చొని ఉన్న అమ్మాయి రూపంలోని వానరుడిని చూస్తారు. వారిద్దరి వల్ల అమ్మాయి రూపంలోని వానరుడు ఇద్దరు పిల్లల్ని కంటాడు. అలా జన్మించిన వారే వాలి, సుగ్రీవులు(Vali – Sugriva). వాలికి ఇంద్రుడు బంగారు తామరపూలతో కూడిన సురపుష్ప మాలను కానుకగా ఇస్తాడు. దాన్ని మెడలో వేసుకుంటే వాలితో ఎదురుగా ఉండి పోరాడే వారి శక్తిలో సగభాగం వాలికి వచ్చేస్తుంది. సుగ్రీవుడు ఈ రహస్యాన్ని రాముడికి చెప్పినందు వల్లే.. చెట్టుచాటు నుంటి బాణం ప్రయోగించి వాలిని రాముడు చంపగలిగారు. ఇక సూర్యుడు తన కొడుకైన సుగ్రీవుడికి .. మిత్రుడు వాయుదేవుడి కొడుకైన హనుమంతుడితో స్నేహాన్ని ఏర్పరిచాడు. ఇద్దరు పిల్లల జననం అనంతరం ఆ అమ్మాయి మళ్ళీ వానరుడిగా మారిపోతుంది.
Also Read :Bank Jobs : ఏపీ, తెలంగాణలో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు.. అప్లై చేసుకోండి
అనంతరం బ్రహ్మదేవుడి ఆదేశాలతో సదరు వానరుడు ఆ ఇద్దరు పిల్లలను తీసుకొని కిష్కింధకు వెళ్తాడు. అక్కడ వానరులకు రాజుగా సదరు వానరుడు అవతరిస్తాడు. వానరులకు రాజుగా మారిన ఆ మహా వానరుడి పేరే.. రుక్షరజసుడు.