Teeth : మీ దంతాలు ఊడిపోయినట్టు కల వచ్చిందా.. అయితే అది దేనికి సంకేతమో తెలుసా?

మీకు ఎప్పుడు అయినా దంతాలు (Teeth) విరిగినట్టు, ఊడినట్టు, ఎవరైనా పీకేసినట్టు కల వచ్చిందా. అయితే అలాంటి కల రావడం మంచిదేనా?

  • Written By:
  • Publish Date - December 5, 2023 / 06:20 PM IST

Teeth Knockout Dream : మామూలుగా మనం పడుకున్నప్పుడు రకరకాల కలలు వస్తూ ఉంటాయి. అందులో కొన్ని మంచి కలలు అయితే మరికొన్ని చెడ్డ కలలు మరికొన్ని భయంకరమైన కలలు, కొన్ని సంతోషకరమైన కలలు వస్తూ ఉంటాయి. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం కలలో జరిగే కొన్ని సంఘటనలు రానున్న రోజుల్లో మంచి, చెడు రెండు సూచనలు ఇస్తాయి. అయితే మీకు ఎప్పుడు అయినా దంతాలు (Teeth) విరిగినట్టు, ఊడినట్టు, ఎవరైనా పీకేసినట్టు కల వచ్చిందా. అయితే అలాంటి కల రావడం మంచిదేనా? అలాంటి కల వస్తే అది దేనికి సంకేతమో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re Now on WhatsApp. Click to Join.

దంతాల గురించి వచ్చే కలలు అవి మీలో ఉన్న ఆందోళనకు, ఆతృతకు సంకేతం అంటున్నారు పరిశోధకులు. దంతాల కలలు, మానసిక ఆలోచనలను అర్థం చేసుకునేందుకు ఒక పరిశోధన నిర్వహించారు. చాలా మంది నిద్రలో పళ్లు కొరకడం గురించి తెలియదన్నారు కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోన్నామని చెప్పారు. ఈ కలలతో నిద్రకు కానీ మానసిక ఆరోగ్యానికి కానీ ఎలాంటి సమస్య లేదని పరిశోధకులు గుర్తించారు. కాగా స్వప్న శాస్త్రం ప్రకారం మీరు కలలో పన్ను విరగడం చూసినట్లయితే మీ జీవితంలో ఏదో ఒక విషయంలో మీరు అసౌకర్యంగా ఉన్నారని అర్థం. అలాగే అది మీ జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపబోతోంది అప్రమత్తంగా ఉండండని చెప్పడమే ఈ కల అర్థం. ఒక వ్యక్తి కలలో తన దంతాలు (Teeth) విరగడం చూస్తే, రాబోయే కాలంలో మీరు జీవితంలో కొత్త అవకాశాలను పొందుతారు.

ఆ అవకాశాల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారని అర్థం. అలాగే ఎవరైనా మీ దంతాలను పట్టుకున్నట్లు లేదా పగలగొట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు మీకు కనిపిస్తే, అది మీ భవిష్యత్తులో ఏదైనా పెద్ద మార్పు జరగబోతోందనడానికి సంకేతం. ఈ మార్పు గురించి మీరు జాగ్రత్తగా ఉండాలనే హెచ్చరిక కూడా .ఒక వ్యక్తి కలలో తన దంతాలు (Teeth) ఎవరో విరగ్గొడుతున్నట్టు కనిపిస్తే మీ జీవితంలో ఏదో తప్పు జరుగుతుందని అర్థం. ఈ విషయాన్ని గుర్తించి ఆ దిశగా వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. మీ దంతాలు పగలగొట్టడాన్ని మీరు చూస్తే ఏదో ఒక విషయంలో తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని అర్థం. అలాంటి పరిస్థితిలో మీరు దానిని అధిగమించడానికి ప్రయత్నించాలి అని సూచన.

Also Read:  Health Benefits: చింతపండు రసం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?