Dhana Trayodashi : ఇవాళ ధన త్రయోదశి . దీన్నే ధన్‌తేరస్ అని కూడా పిలుస్తారు. ఈ పండుగ సందర్భంగా కుబేరుడిని, ఆయుర్వేదాన్ని రచించిన ధన్వంతరిని పూజిస్తారు. ధన్‌తేరస్ రోజున బంగారం, వెండి సహా వంట సామగ్రిని కొనడం సంప్రదాయంగా వస్తోంది. ఇలా చేయడం ద్వారా ధన లాభం పొందుతారని విశ్వసిస్తారు. అందుకే ఏటా ధన త్రయోదశి రోజున కనీసం ఓ చిన్న వస్తువునైనా కొనుగోలు చేస్తుంటారు. ధన త్రయోదశి తిథి ఇవాళ మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషాలకు ప్రారంభమై, రేపు (నవంబర్ 11న) మధ్యాహ్నం 1. 57 గంటల వరకు కంటిన్యూ అవుతుంది. ధన త్రయోదశి పూజా మూహుర్తం ఈరోజు సాయంత్రం 5 గంటల 47 నిమిషాల నుంచి సాయంత్రం 7 గంటల 43 నిమిషాల వరకు ఉంటుంది. ఈ సమయంలో లక్ష్మీ పూజ చేయొచ్చు.
We’re now on WhatsApp. Click to Join.
దీపారాధనతో సకల శుభాలు
- ధన త్రయోదశి రోజున దీపారాధన చేస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి.
- ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగిస్తే.. అది ఇంట్లోకి లక్ష్మీదేవిని స్వాగతిస్తుంది.
- పూజ గదిలో దీపాన్ని వెలిగిస్తే.. కుటుంబంపై ధన వర్షం కురుస్తుంది. ఆనందం వెల్లివిరుస్తుంది.
- వ్యాపార స్థలంలో దీపం వెలిగిస్తే.. మంచి జరుగుతుందని నమ్ముతారు.
ఈసారి బంగారం కొనుగోళ్లు అంతంతే
తులం బంగారం రేటు రూ.60వేల దాకా చేరిన ప్రస్తుత పరిస్థితుల్లో ఇవాళ ధన త్రయోదశి సందర్భంగా గోల్డ్ అమ్మకాలు పెద్దగా జరగకపోవచ్చని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ధరలకు భయపడి కొనేవారు ఏదో మొక్కుబడిగా కొంటారే తప్ప.. భారీగా కొనే అవకాశం లేదని అంటున్నారు. ఈనేపథ్యంలో నగల వ్యాపారులు ఈ సంవత్సరం ఆఫర్ల మీ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. మేకింగ్ చార్జీల్లో డిస్కౌంట్స్.. ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం వంటి ఆఫర్లతో అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినా పెద్దగా స్పందన రావడం(Dhana Trayodashi) లేదట.
Also Read: Gold- Silver Rates: భారీగా తగ్గిన ధరలు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో రేట్స్ ఎలా ఉన్నాయంటే..?
గమనిక: ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాన్ని వినియోగదారులు కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.