Dhana Trayodashi : ‘ధన త్రయోదశి’ని ‘ధన్ తేరస్’ అని కూడా పిలుస్తాం. ఈసారి అక్టోబరు 29న మనం ‘ధన త్రయోదశి’ని జరుపుకోబోతున్నాం. ఆ రోజున సాయంత్రం ప్రతి ఇంటి బయట దీపాన్ని వెలిగిస్తారు. దాన్ని ‘యమదీపం’ అని పిలుస్తారు. ఈ యమదీపాన్ని వెలిగిస్తే కలిగే పుణ్యఫలాలపై చాలా పురాణగాథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ఒకదాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Also Read :Drone Attack : ప్రధాని నివాసంపై డ్రోన్ ఎటాక్.. ఏం జరిగిందంటే.. ?
ఒకానొకప్పుడు హిమ అనే పేరు కలిగిన రాజు ఉండేవాడు. అతడికి ఒకే ఒక కుమారుడు ఉంటాడు. ఒకరోజు తన కుమారుడి జాతకాన్ని చూడాలని పండితులను హిమ రాజు కోరుతాడు.దీంతో పండితులు మొత్తం జాతక చక్రాన్ని నిశితంగా పరిశీలిస్తారు. ‘‘పెళ్లయ్యాక నాలుగు రోజుల్లోనే మీ కుమారుడు చనిపోతాడు’’ అని రాజుకు పండితులు చెబుతారు. దీంతో హిమ రాజు షాక్‌కు గురవుతాడు. ‘‘మీ కుమారుడికి పెళ్లి చేయకండి.. సేఫ్‌గా ఉంటాడు. మరణగండం తప్పుతుంది’’ అని పండితులు సూచిస్తారు. దీంతో తన కొడుకుకు ఇక పెళ్లి చేయొద్దని రాజు భావిస్తాడు. అయితేే కాలం మరోలా ముందుకు సాగుతుంది. హిమరాజు కుమారుడు పెరిగి పెద్దవాడు అవుతాడు. అతడు యవ్వన దశకు చేరుతాడు. ఈ టైంలో హిమరాజు కుమారుడినే పెళ్లి చేసుకుంటానంటూ ఓ రాకుమారి ప్రపోజల్స్(Dhana Trayodashi) పంపుతుంది. దీనిపై మాట్లాడుకునేందుకు హిమరాజు, సదరు రాకుమారి తండ్రి కూర్చుంటారు. తన కొడుకు జాతకం బాగా లేదని, పెళ్లయిన నాలుగు రోజులకే చనిపోతాడని హిమరాజు చెబుతాడు.
Also Read :Viral Videos: గడ్డంలేని బాయ్‌ఫ్రెండ్స్ కావాలి.. కాలేజ్ అమ్మాయిల ర్యాలీ
ఈవిషయం రాకుమారికి కూడా తెలుస్తుంది. అయినా ఆమె వెనకడుగు వేయదు. తాను అతడిని మ్యారేజ్ చేసుకుంటానని తేల్చి చెబుతుంది. దీంతో వారిద్దరికి ఎట్టకేలకు పెళ్లి చేస్తారు. మూడు రోజులు గడిచిపోయి.. నాలుగో రోజు రానే వస్తుంది. నాలుగో రోజున ధన త్రయోదశి ఉంటుంది. ఈసందర్భంగా హిమరాజు కోడలు రోజంతా సౌభాగ్య వ్రతాన్ని ఆచరిస్తుంది. సాయంత్రం టైంలో ఇంటి ద్వారం వద్ద దీపాన్ని వెలిగిస్తుంది. ద్వారానికి రెండువైపులా బంగారు, వెండి ఆభరణాలను కుప్పలుగా పోస్తుంది. ఆ సమయంలో హిమరాజు కొడుకు ప్రాణాలను తీసుకెళ్లేందుకు యముడు పాము రూపంలో అక్కడికి వస్తాడు. ఇంటి ద్వారం వద్దనున్న దీపం వెలుగు, బంగారు ఆభరణాల తళుకులను చూస్తూ పాము అక్కడే కాసేపు ఉండిపోతుంది. అంతలోగా చావుఘడియలు దాటిపోతాయి. దీంతో పాము రూపంలో వచ్చిన యముడు ఖాళీ చేతులతో వెనక్కి వెళ్లిపోతాడు. అందుకే ధన త్రయోదశి రోజు వెండి, బంగారు ఆభరణాలు కొంటుంటారు.