Site icon HashtagU Telugu

TTD : టీటీడీ అన్న ప్ర‌సాదం ట్ర‌స్టుకు రూ.కోటి 10 వేలు ఇచ్చిన భక్తుడు

Surya Pawan Kumar Donated R

Surya Pawan Kumar Donated R

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి నిత్యం భక్తులు భారీగా విరాళాలు అందజేస్తూ తమ భక్తిని చాటుకుంటుంటారు. తాజాగా లక్కీ ఫర్ యు ఎగ్జిమ్స్ కంపెనీ(Lucky for You Exams Company)కి చెందిన సూర్య పవన్ కుమార్ (Sri Surya Pawan Kumar) టీటీడీ అన్నప్రసాదం ట్రస్ట్‌(TTD Anna Prasadam Trust)కు ఏకంగా రూ.కోటి 10 వేల 116 విరాళంగా అందించి వార్తల్లో నిలిచారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జే. శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి డీడీని స్వీకరించారు. అలాగే తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి చెన్నైకి చెందిన వసంత లక్ష్మి కుటుంబం రూ.27 లక్షల విలువైన బంగారు కిరీటాన్ని విరాళంగా అందించారు. ఈ కిరీటం 341 గ్రాముల బరువుతో ప్రత్యేకంగా తయారు చేయబడింది. ఆలయ అర్చకులు, సూపరింటెండెంట్‌ పండితుల సమక్షంలో ఈ కిరీటాన్ని స్వీకరించారు.

ఇదిలా ఉంటె ..తిరుపతి శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జనవరి 10న వైకుంఠ ఏకాదశి, 11న వైకుంఠ ద్వాదశి పర్వదినాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వైకుంఠ ఏకాదశి నాడు వేకువజామున ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, భక్తులకు దర్శనాలు నిర్వహించనున్నారు. జనవరి 11న చక్రస్నానం కార్యక్రమంతో ఈ పర్వదినాలను ముగించనున్నారు. 2025 ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1న స్వామివారి ప్రత్యేక సేవలను టీటీడీ నిర్వహించనుంది. వేకువజామున ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవలతో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో భక్తులకు సర్వదర్శనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమాలు, ధార్మిక ప్రబోధనలు కూడా ఉంటాయి.

Read Also : Vizag Lands : జనవరి ఒకటి నుండి విశాఖలో భూముల రిజిస్ట్రేషన్ పెంపు