Site icon HashtagU Telugu

Ayodhya : అయోధ్య పేరుతో కొత్త మోసానికి తెరలేపిన సైబర్ నేరగాళ్లు

Cyber Criminals Cheat Peopl

Cyber Criminals Cheat Peopl

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అయోధ్య (Ayodhya ) పేరు మారుమోగిపోతుంది. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట (Ram Temple Opening)కార్యక్రమం ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) చేతుల మీదుగా సోమవారం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఘట్టానికి తెరపడడంతో అంత అయోధ్య రాముడి గురించి..అక్కడి ప్రసాదాలు , రాముడి దర్శనం గురించి మాట్లాడుకోవడం..సెర్చ్ చేయడం చేస్తున్నారు. దీంతో సైబర్ నేరగాళ్ల (Cyber Criminals) కళ్లు అయోధ్య ఫై పడింది.

దేశంలో ఎప్పుడు ఏంజరగుతుందా..? అంటూ నిత్యం డేగకళ్లతో ఎదురుచూసే సైబర్ నేరగాళ్లు..ఇప్పుడు రామ భక్తులను టార్గెట్ గా చేసుకొని కొత్త మోసానికి తెరలేపారు. అయోధ్య ప్రసాదం (Ayodhya Prasad) అందించడంతో పాటు వీఐపీ ఎంట్రీ పాసులు (VIP Entry Pass) ఇప్పిస్తామని చెప్పి.. మోసాలకు పాల్పడుతున్నారు. జనవరి 22వ తేదీన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగడం, రామ్‌లల్లాని దర్శించుకోవడం కోసం భక్తులందరూ అయోధ్యకు పోటెత్తుతున్న తరుణంలో.. సైబర్ నేరగాళ్లు ఈ కొత్త మోసానికి తెరలేపారు. ప్రసాదం, ఎంట్రీ పాసుల పేరిట భక్తుల్ని బురిడీ కొట్టించి.. భారీ స్థాయిలో డబ్బులు దండుకోవాలని ప్లాన్ చేశారు. ఆల్రెడీ కొందరు భక్తులు ఈ సైబర్ నేరగాళ్ల ట్రాప్‌లో పడి, భారీ మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నారు. దీంతో పోలీసులు అలెర్ట్ అయ్యి..భక్తులకు పలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటె రామమందిర ప్రారంభోత్సవం కారణంగా దేశంలో సుమారు రూ.1.25 లక్షల కోట్ల వ్యాపారం జరిగిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAT) తెలిపింది. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే రూ.40 వేల కోట్లు, ఢిల్లీలో రూ.25 కోట్ల మేర వ్యాపారం జరిగినట్టు ఆ సంస్థ పేర్కొంది. భక్తి కారణంగా ఈ రేంజ్‌లో బిజినెస్ జరగడం.. దేశంలోనే తొలిసారి అని క్యాట్ జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు.

తొలిరోజు బాల రాముడ్ని 5 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు అంచనా వేస్తున్నారు. మంగళవారం సామాన్య భక్తులకు దర్శన సౌకర్యం అందించడం తో తెల్లవారు జామున 3 గంటల నుంచే ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. అయోధ్యలోని ప్రధాన మార్గమైన రామ్ ఫథ వీధులన్నీ రామభక్తులతో నిండిపోయాయి. తొలిరోజు మధ్యాహ్నానికి 2.5 నుంచి 3 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు అంచనా. అంతేకాక అదే స్థాయిలో రామాలయం బయట కూడ భక్తలు వేచి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మొత్తంగా తొలిరోజు అయోధ్య రామయ్యను 5 లక్షల మంది దర్శంచుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Read Also : Viral : అయోధ్య రాముడు కళ్లు తెరిచి చూస్తున్నాడు..!!