Crow : కాకి ని ‘కాలజ్ఞాని’ అని ఎందుకు అంటారో మీకు తెలుసా..?

  • Written By:
  • Publish Date - August 22, 2023 / 06:50 PM IST

కాకి (Crow )..ఈ పక్షి చరిత్ర గురించి చాలామందికి తెలియదు..అంత కూడా కాకి అంటే నల్లగా ఉంటది..మాంసాన్ని తింటాది..ఎప్పుడు కావు కావుమని అంటది..కాకి అరిస్తే ఇంటికి చుట్టాలు వస్తారు అంటారు అని చాలామంది చెపుతుంటారు. కానీ కాకిని కాలజ్ఞాని అని పిలుస్తారని చాలామందికి తెలియదు. ఈ మధ్య బలగం (Balagam Movie) సినిమా ద్వారా కాకి గురించి కొంతవరకు తెలిసింది.

వేకువజామునే బ్రహ్మ ముహూర్తం లో మేల్కొని కావు కావు మని అరుస్తూ అందరినీ నిద్రలేపుతుంది కాకి (Crow ). కాకికి ఎక్కడైనా ఆహారం కనిపిస్తే అది ఒక్కటే తినకుండా మిగతా కాకులను కూడా తీసుకు వచ్చి ఆహారాన్ని అందిస్తుంది. అంత స్నేహపూర్వకంగా మెదులుతాయి కాకులు. శత్రువులను కూడా వెంటనే గుర్తించి అన్ని కాకులకు సందేశాన్ని ఇచ్చి ఒక సంఘటితంగా ఉండటం లో కాకులు ముందుంటాయి. ఆడ కాకి,మగ కాకి కలవడం కూడా ఎవరీ కంటపడకుండా చాలా గోప్యంగా కలుస్తాయట. అంత మంచి జ్ఞానం కలిగి ఉండటం ఒక గొప్ప విషయంగా చెప్పవచ్చు. సూర్యాస్తమయం తర్వాత ఎట్టిపరిస్థితుల్లో ఆహారం ముట్టని గుణం కాకులది.

ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందు కూడా భూమి కంపించే ముందు కాకులు సూచనలిస్తూ ఎగురుతూ వైపరీత్యాలను సూచిస్తాయి. సూర్య గ్రహణం ఏర్పడిన సమయంలో కాకులు గూటికి చేరి గ్రహణం విడిచాక అవి స్నానం చేస్తాయట. అందుకే కాకిని కాలజ్ఞాని అంటారు. ఒక కాకి మరణిస్తే అన్ని కాకులు గుమిగూడి రోదిస్తూ ఆ తర్వాత స్నానమాచరించి గూటికి చేరే ఆచరణ కాకులకు ఉంటుందట.

మన హిందూ పురాణాలలో కాకులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. పురాణాల ప్రకారం కాకి శని (Shani God) దేవుని యొక్క వాహనం అంటారు. ఈ కారణంగా దీనికి పూజలు చేస్తుంటారు. రావణుడికి భయపడి కాకి రూపాన్ని ధరించిన యముడు కాకులకు గొప్ప వరాలిచ్చాడు. తాను ప్రాణులన్నింటికీ రోగాలను కలిగించేవాడు కనుక, తానే స్వయంగా కాకి రూపాన్ని ధరించినందువల్ల ఆనాటి నుంచి కాకులకు సాధారణంగా రోగాలేవీ రావన్నాడు. అవి చిరాయువులై ఉంటాయని కాకులకు వరమిచ్చాడు యముడు. యమలోకంలో నరక బాధలను భరించేవారి బంధువులు అలా మరణించిన వారికి సమర్పించే పిండాలను కాకులు తిన్నప్పుడే నరక లోకంలోని వారికి తృప్తి కలుగుతుందన్నారు. యముడు స్వయంగా వాయుసాలకు (కాకులకు) ఈ వరాలిచ్చినందువల్లనే ఈ నాటికీ పితృకర్మల విషయంలో కాకులకు పిండాలు పెడుతున్నారు.

కాకులు లేని ప్రదేశం లేదు ఈ భూమిపై కాకి పళ్ళు తిని మరో చోట విసర్జన చేస్తే అక్కడ ఆ బీజం పడి మొలకెత్తి మొక్కలు పెరిగి వటవృక్షాలుగా పెరుగుతాయి. అలా పచ్చని ప్రకృతిని విస్తరించి పరిరక్షించుకోవడంలో కాకుల పాత్ర చాలా గణనీయమైనది. అందుకే “కాకులు దూరని కారడవి” అని అంత అంటారు. ఇలా కాకి చరిత్ర చాల పెద్దదే..కాకే కదా అని చిన్న చూపు చూడకండి.

Read Also : Sleeping: ఎక్కువసేపు నిద్రపోతే ఎన్ని నష్టాలున్నాయో తెలుసా