Site icon HashtagU Telugu

Helicopter Services: హెలికాప్టర్ ద్వారా చార్ ధామ్ యాత్ర.. ఛార్జీల వివరాలివే..!

Helicopter Services

Helicopter Services

Helicopter Services: మే 10 నుంచి చార్ ధామ్ యాత్ర ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో భక్తులు ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్, యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్ ఆలయాలను సందర్శించడం ద్వారా చార్ ధామ్ యాత్రను పూర్తి చేస్తారు. చార్‌ధామ్ యాత్ర కోసం కాలినడకన వెళ్లలేని భక్తుల కోసం హెలికాప్టర్ సేవలు (Helicopter Services) అందిస్తున్నారు. అదేవిధంగా మీరు కూడా చార్ధామ్ యాత్ర కోసం హెలికాప్టర్‌లో వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే ఛార్జీలు ఎంత ఉంటాయి..? ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకుందాం.

ఎలా బుక్ చేయాలి?

మీరు IRCTC అధికారిక వెబ్‌సైట్ నుండి చార్ధామ్ యాత్రకు టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా చార్ ధామ్ యాత్రకు టికెట్ బుకింగ్ ఫీజు, ఎప్పుడు బుక్ చేయాలో తెలుసుకోవడానికి పూర్తి సమాచారాన్ని ఇక్క‌డ తెలుసుకోండి.

హెలికాప్టర్ బుకింగ్ సమయం

IRCTC హెలికాప్టర్ సేవను heliyatra.irctc.co.in ద్వారా పొందవచ్చు. ప్రస్తుతం మే 10 నుండి జూన్ 20 వరకు, సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 31 వరకు భక్తులకు హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉన్నాయి. IRCTC ప్రకారం.. జూన్ 21 నుండి సెప్టెంబర్ 14 వరకు ప్రయాణ తేదీలు త్వరలో ప్రకటించబడతాయి.

Also Read: SRH Playoffs: టాస్ వేయ‌కుండానే మ్యాచ్ ర‌ద్దు.. ప్లేఆఫ్స్‌కు చేరిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌

ముందు బుకింగ్ చేసుకోవాలి

హెలికాప్టర్ సేవ కోసం ఆన్‌లైన్‌లో బుక్ చేస్తున్నప్పుడు, ఉత్తరాఖండ్ ప్రభుత్వ పోర్టల్‌లో చార్ ధామ్ యాత్రకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. మీరు ఇంతకు ముందు రిజిస్టర్ చేసుకోకుంటే తప్పనిసరిగా registrationandtouristcare.uk.gov.inలో నమోదు చేసుకోవాలి.

We’re now on WhatsApp : Click to Join

ఎలా బుక్ చేయాలి..?

– హెలికాప్టర్ సేవ కోసం IRCTCలో ఖాతా తెరవాలి.
– దీని కోసం www.heliyatra.co.in/auth కు వెళ్లండి.
– ఇమెయిల్ ID, నంబర్‌ను ధృవీకరించండి.
– నమోదిత మొబైల్ నంబర్ మీ వినియోగదారు ID అవుతుంది.
– పాస్ వ‌ర్డ్‌ను సెట్ చేసి లాగిన్ చేయండి.
– రిజిస్ట్రేషన్ నంబర్ లేదా గ్రూప్ IDని నమోదు చేయడం ద్వారా సీటు లభ్యతను తనిఖీ చేయండి.
– ప్రయాణ సమయం, తేదీ స్లాట్‌ను ఎంచుకోండి.
– ఆన్‌లైన్ చెల్లింపు చేయడం ద్వారా బుకింగ్‌ను నిర్ధారించండి.
– టికెట్ బుక్ చేసుకున్న తర్వాత డౌన్‌లోడ్ చేసుకోండి.

హెలికాప్టర్ రౌండ్ ట్రిప్ ధ‌ర‌లివే

ఫాటా టు కేదార్‌నాథ్: రూ. 6,074
సిర్సీ నుండి కేదార్‌నాథ్: రూ. 6,072
గుప్తకాశీ నుండి కేదార్‌నాథ్: రూ. 8,426
అదనపు సౌలభ్యం, PG ఛార్జీలు ఉంటాయి.
బుకింగ్ సమయంలో సమర్పించాల్సిన రుజువుగా మీరు మీ ఒరిజినల్ IDని తీసుకురావాలి. స్క్రీన్‌షాట్‌లు లేదా సగం ముద్రిత టిక్కెట్‌లు ఆమోదించబడవు.