Site icon HashtagU Telugu

Bhole Baba : భోలే బాబా ఆస్తుల విలువ తెలిస్తే గుండె ఆగిపోద్ది..!!

Bhole Baba Property

Bhole Baba Property

భోలే బాబా (Bhole Baba)..ఈ పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. మూడు రోజుల క్రితం భోలే బాబా అంటే పెద్దగా ఎవరికీ తెలియదు..అసలు ఎవరు పట్టించుకోలేదు..కానీ ఎప్పుడైతే..హత్రాస్‌లో (Hathras Stampede) జరిగిన తొక్కిసలాట 126 మంది వరకు చనిపోవడం తో అంత ఈయన గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ మధ్య జైలు కు వెళ్లి వచ్చిన వారంతా బాబా అవతారం ఎత్తి కోట్లు వెనకేసుకుంటున్నారు. ఈ భోలే బాబా కూడా అంతే. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఈయన..చదు పూర్తి చేసుకున్నాక.. 18 సంవత్సరాల పాటు ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసాడు. ఆ తర్వాత వీఆర్ఎస్ (వాలంటరీ రిటైర్‌మెంట్ స్కీమ్) తీసుకుని, ఆధ్యాత్మిక బాట పట్టాడు.

We’re now on WhatsApp. Click to Join.

పోలీసు శాఖలో పని చేసే సమయంలోనే ఆయనపై లైంగిక వేధింపుల కేసులో నమోదు కావడం తో జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఆ తర్వాత నారాయణ్ సాకార్ విశ్వహరి బాబాగా పేరు మార్చుకొని , తన పూర్వీకుల గ్రామంలో ఓ ఆశ్రమాన్ని తెరించి జనాలను ఆకర్షించడం మొదలుపెట్టారు. అలా గత కొన్ని ఏళ్లుగా ఆశ్రమం నడిపిస్తూ దాదాపు రూ.100 కోట్లు వెనకేసుకున్నాడు. ఈ విషయం తెలిసి అంత షాక్ అవుతున్నారు. కేవలం ఒక ఆశ్రమం మాత్రమే కాదు..దేశ వ్యాప్తంగా అనేక చోట్ల శ్రీ నారాయణ్‌ హరి సాకార్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ అనే పేరుతో ఆశ్రమాలు నడిపిస్తున్నట్లు బయటపడింది. యూపీలోని మెయిన్‌పురిలోని హరి నగర్ అని పిలిచే ఆశ్రమంలో భోలే బాబా నివాసం ఉంటారు.

ఈ హరి నగర్ 13 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో భోలే బాబా, ఆయన భార్య కోసం దాదాపు 6 లగ్జరీ రూమ్స్‌ ఉన్నాయి. ఇక హరి నగర్ ఆశ్రమంలోకి వెళ్తుండగా ఆ ఆశ్రమానికి విరాళం ఇచ్చిన 200 మంది పేర్లు రాసి ఉంటాయి. అందులే రూ.10 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు ఇచ్చిన దాతల పేర్లు ఉంటాయి. ఇక ప్రస్తుతం ఇటావాలో మరో కొత్త ఆశ్రమాన్ని నిర్మిస్తున్నారు.

అలాగే వైట్ కలర్ డ్రెస్, టై, కళ్లద్దాలతో భోలే బాబా దర్శనం ఇస్తుంటారు. ఆయన కోసం వచ్చిన వారిని కలిసేందుకు వచ్చే సమయంలో భారీ కాన్వాయ్‌తో వస్తారట… బాబా ప్రయాణించే కారుకు ముందు 16 మంది బాడీగార్డులు.. ఖరీదైన బైక్‌లపై వెళ్తూ.. ఆయన కారుకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూస్తారు. ఇక ఆయన కారు వెనకాల దాదాపు 30 కార్లతో భారీ కాన్వాయ్‌ ఉంటుంది. ఇక భోలే బాబా మాత్రం వైట్ టయోటా ఫార్చునర్‌ కారులో ఎప్పుడూ ప్రయాణం చేస్తారట. ఇలా మొత్తం మీద బాబా గట్టిగానే భక్తుల నుండి విరాళాలు సేకరించినట్లు తెలుస్తుంది.

Read Also : Bihar Bridge Collapse : బిహార్లో 14 రోజుల్లో 12 బ్రిడ్జిలు కూలిపోయాయి..ప్రభుత్వం ఏంచేస్తుందంటే..!!