Site icon HashtagU Telugu

Ram Mandir : అయోధ్య రామమందిరంలో విగ్రహ ప్రతిష్టాపన అప్పుడే.. ఘనంగా రామ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు..

Gifts From Abroad

Ayodhya Ram Mandir Temple Opening Ceremony Date announced

భారతీయులంతా ఎదురు చూస్తున్న రామ మందిరం(Ram Mandir) కల సాకారమవుతుంది. ఇప్పటికే మోడీ(Modi) శంకుస్థాపన చేసిన అయోధ్య(Ayodhya) రామ మందిర నిర్మాణ పనులు అత్యంత శరవేగంగా సాగుతున్నాయి. అయోధ్య రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్ని పనులు చకచకా సాగుతున్నాయి. ఆలయం పనులు పూర్తి కావస్తున్నాయి. తాజాగా రామ మందిరంలో విగ్రహ ప్రతిష్టాపన గురించి రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది.

రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నేడు మీడియాతో మాట్లాడుతూ.. 2024 జనవరిలో అయోధ్య రామమందిరంలో విగ్రహ ప్రతిష్టాపన ఉంటుంది. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఇప్పటికే ప్రధాని మోదికి ఆహ్వానం పంపించాం. 2024 జనవరి 15 నుంచి 24 వరకు ఘనంగా రామ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు జరుగుతాయి. దేశంలోని ప్రతి గ్రామంలోని దేవాలయాలను ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే అయోధ్యలో శరవేగంగా రామాలయ నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఆలయం మొదటి అంతస్తు పూర్తయింది. రామ విగ్రహ ప్రతిష్ఠాపననకు లక్షల్లో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉంది అని తెలిపారు. ఈ ప్రకటనతో రామ భక్తులు, హిందువులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

Also Read : IPTO Complex: ఐఈసీసీ కోసం నరేంద్ర మోడీ ప్రత్యేక పూజలు.. ఫొటోస్ వైరల్?