Site icon HashtagU Telugu

Chukkala Amavasya 2024 : ఆగస్టు 4న చుక్కల అమావాస్య.. ఆ రోజు ప్రత్యేకత తెలుసా ?

Chukkala Amavasya 2024

Chukkala Amavasya 2024 : ఆగస్టు 4న ఆషాఢ అమావాస్య రాబోతోంది. దీన్నే చుక్కల అమావాస్య అని కూడా పిలుస్తారు.  ఆ రోజున పితృదేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలు వదులుతారు. చుక్కల అమావాస్య రోజు చేసే దానధర్మాలు, జపతపాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఆ రోజున పితృకర్మలు నిర్వహించినా.. వారి పేరిట దానధర్మాలు చేసినా మంచి ఫలితాలు లభిస్తాయి. వివరాలివీ..

We’re now on WhatsApp. Click to Join

దక్షిణాయనం మొదలైన వెంటనే వచ్చే తొలి అమావాస్య.. ఆషాఢ అమావాస్య(Ashadha Amavasya). అందుకే దానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఏటా జనవరిలో మకర సంక్రాంతి వస్తుంది. అప్పటి నుంచి ఉత్తరాయణ కాలం మొదలవుతుంది. ఏటా జులై  నెలలో కర్కాటక సంక్రాంతి వస్తుంది. అప్పటి నుంచి దక్షిణాయన కాలం మొదలవుతుంది. ఉత్తరాయణ కాలం అనేది దైవకార్యాలకు మంచి సమయం. దక్షిణాయణ కాలం అనేది పితృకార్యాలకు మంచి సమయం. ఇక ఈసారి ఆషాఢ అమావాస్య ఘడియల విషయానికొస్తే.. అది ఆగస్టు 3న(శనివారం) మధ్యాహ్నం 3 గంటల 31 నిమిషాలకు మొదలై ఆగస్టు 4న (ఆదివారం) మధ్యాహ్నం 3 గంటల 54 నిమిషాల వరకు కొనసాగుతుంది. పితృదేవతలకు తర్పణాలు వదిలేవారు ఆదివారం రోజు కొన్ని నియమాలను తప్పక పాటించాలి.

Also Read :2006 Jobs : టైపింగ్ వచ్చా.. 2006 కేంద్ర ప్రభుత్వ జాబ్స్‌ మీకోసమే!

ఆషాఢ అమావాస్య రోజు కొన్ని ప్రాంతాల్లో గౌరీ పూజ(Chukkala Amavasya 2024) చేస్తారు. పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి పూజించి.. బియ్యంపిండితో చేసిన కుడుములు సమర్పిస్తారు. గౌరీపూజ చేసే అవివాహితులకు త్వరలోనే పెళ్లవుతుందని నమ్ముతారు. కొత్త కోడళ్లు కూడా చుక్కల అమావాస్య పేరుతో నోము నోచుకుంటారు. ఉదయాన్నే గౌరీపూజ చేసి సాయంత్రం దాకా ఉపవాసం ఉంటారు. ఈ సమయంలో అమ్మవారి ముందు వంద చుక్కలు పెట్టి వాటిపై వంద దారపు పోగులు ఉంచుతారు. వాటిని దండగా అల్లుకుని మరుసటిరోజు ధరిస్తారు. దాన్ని కట్టుకుంటే శుభాలే జరుగుతాయని నమ్ముతారు. ఆషాఢ అమావాస్య మరుసటి రోజు  నుంచే శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణ మాసం శుభముహూర్తాలకు నెలవు.

Also Read :Rajinikanth – Prabhas : ప్రభాస్, రజినిని ఫాలో అవుతున్నాడా..?

గమనిక : కొందరు నిపుణులు చెప్పిన, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా పైన ఉన్న సమాచారాన్ని అందించాం. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని రీడర్స్ గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.