Site icon HashtagU Telugu

Wednesday: బుధవారం రోజు ఇలా చేస్తే చాలు.. దరిద్రం పోయి ధనవంతులు అవ్వాల్సిందే?

Mixcollage 04 Feb 2024 06 20 Pm 3496

Mixcollage 04 Feb 2024 06 20 Pm 3496

ప్రస్తుతం రోజుల్లో చాలామంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఎంత కష్టపడి డబ్బు సంపాదించినా కూడా డబ్బులు చేతిలో మిగలకపోగా అదనంగా అప్పులు చేయాల్సి వస్తోందని అప్పుల భారంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే డబ్బులు చేతికి ఇవ్వాల్సిన వారు కూడా ఇవ్వకుండా సతాయిస్తున్నారని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు కూడా అలా ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటే బుధవారం రోజు కొన్ని రకాల పనులు చేస్తే చాలు ఆర్థిక సమస్యలు పటా పంచులు అవ్వాల్సిందే. బుధవారం రోజు ఈ పని చేస్తే దరిద్రం తొలగి పోయి ధనవంతులు అవుతారు.

మరి బుధవారం రోజు ఎటువంటి పనులు చేయాలి అన్న విషయానికి వస్తే.. హిందూ ధర్మం ప్రకారం ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఒక్కోరోజు ఒక్కో దేవుడికి ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. అలా బుధవారం రోజు గణపతికి ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. కాబట్టి ఆ రోజు పూజ చేయడం వల్ల కొంతమేర ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడతారు అని చెబుతున్నారు. వాస్తు దోషాలు వల్ల కొన్నిసార్లు అనేక సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. ఇక ఇటువంటి సమయంలో ఇంటి వెలుపల ఇంటిలోపల గణపతి విగ్రహాలను పెట్టడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి.

ఆ గణపతి విగ్రహాలను రెండింటినీ ఒక దానికొకటి వెనకభాగం కలిసి ఉండేలా ముఖ ద్వారం దగ్గర ఏర్పాటు చేస్తే వాస్తు దోషాలు తొలగిపోయి మేలు జరుగుతుంది. ఆర్థిక కష్టాల నుంచి బయటపడటానికి బుధవారం రోజున 21 లేదా 42 జాపత్రి ఆకులతో గణపతికి పూజ చేస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అలాగే డబ్బు కూడా వస్తుంది. అంతేకాదు బుధవారం రోజున ఆవుకు పచ్చి గడ్డి మేతగా వేయడం వల్ల జాతకంలోని దోషాలు నశించి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అనుకున్న పనుల్లో పురోగతి సాధించి, ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక సమస్యల వల్ల చాలా అప్పులు చేసి తిరిగి చేసిన అప్పులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న వారు బుధవారం రోజున పెసలను ఉడికించి అందులో కాస్త పంచదార, నెయ్యి వేసి ఆవులకు తినిపిస్తే మంచి జరుగుతుంది. ఇలా క్రమం తప్పకుండా ఐదు నుండి ఏడు వారాల పాటు చేయడం వల్ల అప్పుల నుండి విముక్తి లభిస్తుంది. పైన చెప్పిన పరిహారాలు పాటించడం వల్ల ఆర్థిక కష్టాలు తొలగిపోయి ధనవంతులు అవుతారు.