Wedding Season : మూడాల కారణంగా గత మూడు నెలలుగా శుభకార్యాలు జరగడం లేదు. త్వరలోనే శుభ కార్యాలు, పెళ్లిళ్ల సీజన్ రాబోతోంది. దీపావళి పండుగ ముగిసిన వెంటనే ఇందుకు లైన్ క్లియర్ అవుతుంది. నవంబరు, డిసెంబరు నెలల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఇప్పటి నుంచే చాలామంది శుభకార్యాల కోసం ముహూర్తాలను ఫిక్స్ చేసుకొని, ఫంక్షన్ హాళ్లను బుక్ చేసుకుంటున్నారు. అంటే ఈ సంవత్సరం చివరి రెండు నెలల పాటు వాయిద్యాలు, మండపాలు, క్యాటరింగ్ నిర్వాహకులకు చేతినిండా పని దొరకబోతోందన్న మాట.
Also Read :10th Pass Jobs : పదో తరగతి పాసైన వారికి ‘యంత్ర’ ఫ్యాక్టరీలో 3883 జాబ్స్
నవంబరు, డిసెంబరులలో 21 శుభ ముహూర్తాలు ఉన్నాయని పండితులు(Wedding Season) అంటున్నారు. ఆయా రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వేలాది పెళ్లిళ్లు, ఇతరత్రా శుభ కార్యాలు జరగనున్నాయి. నవంబరు నెలలో 3, 7, 8, 9, 10, 13, 14, 15, 16, 17 తేదీల్లో శుభ కార్యాల కోసం మంచి ముహూర్తాలు ఉన్నాయి. డిసెంబరు నెలలో 5, 6, 7, 8, 9, 10, 13, 14, 15, 18, 26 తేదీల్లో శుభ కార్యాల కోసం మంచి ముహూర్తాలు ఉన్నాయి.
శుభ ముహూర్తాలు సమీపించిన ప్రస్తుత తరుణంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఫంక్షన్ హాళ్ల బుకింగ్‌కు జనం క్యూ కడుతున్నారు. కాస్త పెద్ద సైజు ఫంక్షన్ హాళ్ల అద్దెలు సగటున రూ.45వేల నుంచి రూ.3 లక్షల దాకా ఉన్నాయి. నగరాన్ని, పట్టణాన్ని బట్టి.. అందులోని వసతులను బట్టి ఈ రేట్లలో తేడాలు ఉంటాయి. వస్త్ర దుకాణాలు, బంగారు దుకాణాలు కూడా జనంతో కిటకిటలాడుతున్నాయి. ఓ వైపు దీపావళి.. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ ఏకకాలంలో రావడంతో ఈ రెండు వ్యాపారాలు చేసే వారికి భలే గిరాకీ వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలలోని వస్త్ర దుకాణాలు, బంగారం దుకాణాలకు కస్టమర్ల తాకిడి పెరిగింది. అకస్మాత్తుగా పెరిగిన ఈ డిమాండు ప్రభావంతో బంగారం రేట్లు కొంతమేర పెరిగే ఛాన్స్ ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి.
గమనిక : కొందరు నిపుణులు చెప్పిన, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా పైన ఉన్న సమాచారాన్ని అందించాం. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని రీడర్స్ గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.