Money Vastu: డబ్బులు లెక్కించేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. చేసారో అంతే సంగతులు?

చాలామంది జీవితంలో ఎంత కష్టపడి సంపాదించినా కూడా కొన్ని కొన్ని సార్లు ఆర్థిక సంక్షోభం కారణంగా ఎన్నో

  • Written By:
  • Publish Date - December 17, 2022 / 06:00 AM IST

చాలామంది జీవితంలో ఎంత కష్టపడి సంపాదించినా కూడా కొన్ని కొన్ని సార్లు ఆర్థిక సంక్షోభం కారణంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. మరి కొంతమంది కష్టపడి సంపాదించినప్పటికీ ఎప్పటికప్పుడు ఆ డబ్బులు ఖర్చయిపోయి ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తే వారికి ఎప్పుడు ఆర్థిక సంక్షోభం ఎదురవ్వదు. ఆర్థిక సంక్షోభం రావడానికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ అందులో లక్ష్మీదేవి అసంతృప్తికి గురిచేయడం కూడా ఒకటి. లక్ష్మీదేవిని అసంతృప్తికి గురి చేస్తే ఇంట్లో దారిద్యం వస్తుంది. అయితే మనం కొన్ని కొన్ని సార్లు తెలిసి తెలియక చేసే కొన్ని పనుల వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అందులో డబ్బులు లెక్కించేటప్పుడు మనం చేసే పొరపాట్ల వల్ల కూడా లక్ష్మీదేవి కోపం వస్తుంది.

మరి డబ్బులు లెక్కించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలామంది డబ్బులు లెక్క పెట్టేటప్పుడు చేసే మొదటి పొరపాటు చేతికి ఉమ్ము అంటించుకోవడం. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. నోట్లు లెక్కించేటప్పుడు కొంతమంది బొటన వేలిపై ఉమ్మి అంటించి లెక్కిస్తారు. అలా చేయడం వల్ల అతుక్కున్న నోట్లు ఫ్రీగా వస్తాయని డబ్బులు ఎంచడం కూడా తొందరగా అయిపోతుందని అనుకుంటూ ఉంటారు. కానీ అలా చేయడం వల్ల మురికి ,తప్పు ,ఆర్థిక నష్టానికి దారి తీస్తుంది. కరెన్సీ నోట్లపై ఉమ్మి అంటించడం ఆరోగ్య పరంగా కూడా తప్పు. ఇలా చేయడం లక్ష్మికి ,డబ్బుకు అవమానంగా కూడా పరిగణించబడుతుంది.

కాబట్టి ఇకపై డబ్బులు లెక్క పెట్టేటప్పుడు ఉమ్మిని అంటించుకోకుండా డబ్బులు లెక్క పెట్టడం మంచిది. ఒకవేళ మీరు మీ వేలికి తడి చేసుకోవాలి అనుకుంటే కొంచెం వాటర్ ని తడి చేసుకోవచ్చు. అలాగే కొంతమంది ఎప్పుడూ స్నానాలను విసిరేస్తూ ఉంటారు. మరి కొంతమంది నోట్లో కట్టలు నోట్లను డబ్బులను విసిరిస్తూ ఉంటారు. ఈ విధంగా చేయడం తప్పు. ఇలా చేయడం వల్ల ఎదుటి వ్యక్తిని మనం అవమానించడంతోపాటు లక్ష్మీదేవిని కూడా అవమానించినట్టు అవుతుంది. అలా చేయడంవల్ల ఇంట్లో మాత లక్ష్మి ఎప్పుడూ నివసించదు. అలాగే చాలామంది డబ్బు బయట నుంచి తీసుకొచ్చినప్పుడు కొన్ని పనుల వల్ల అక్కడ ఇక్కడ పెడుతూ ఉంటారు. కానీ అలా చేయడం తప్పు. ఆ విధంగా చేయడం వల్ల మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి బయట నుంచి డబ్బు తెచ్చిన వెంటనే దేవుడి దగ్గర లేదంటే మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో పెట్టడం ఉత్తమం.