Site icon HashtagU Telugu

Friday Donation Tips : శుక్రవారం ఆ రంగు వస్తువులను దానం చేస్తున్నారా.. అయితే మీరు చిక్కుల్లో పడ్డట్టే?

Are You Donating Those Colored Items On Friday.. But You Are In Trouble..

Are You Donating Those Colored Items On Friday.. But You Are In Trouble..

Tips for Donations on Friday : మామూలుగా వారంలో కొన్ని రోజుల్లో కొన్ని రకాల పనులు చేయడం అసలు మంచిది కాదని పండితులు చెబుతూ ఉంటారు. అలా చేయడంవల్ల అనేక రకాల సమస్యలు కొని తెచ్చుకున్నట్టే అని చెబుతూ ఉంటారు. అలా శుక్రవారం (Friday) రోజున కూడా కొన్ని రకాల వస్తువులను దానం (Donation) చేయడం లేదని ఇతరులకు ఇవ్వడం అసలు మంచిది కాదని అంటున్నారు పండితులు. మరి శుక్రవారం (Friday) రోజు ఏ రంగు వస్తువులను ఇవ్వకూడదో దానం (Donation) చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

శాస్త్రం ప్రకారం శుక్రవారం తెల్లటి వస్తువులను దానం చేయకూడదట. సంపదలకు దేవత అయిన లక్ష్మీ దేవితో ముడిపడి ఉన్న ఈ రోజున మీరు కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే, పేదరికం మీ ఇంట్లోకి ప్రవేశించదు. ఈ తప్పులు చేయనప్పుడే పూజ పునస్కార పుణ్యం లభిస్తుంది. శుక్రుని ప్రభావం జీవితంలో ఆనందం, శ్రేయస్సును తెస్తుంది. శుక్రవారం పంచదార దానం చేయకూడదు, అది మీ జీవితంలోని ఆనందాన్ని తగ్గిస్తుంది. గ్రహాల సంచారం ఆధారంగా దానధర్మాలు చేస్తే జీవితంలో సుఖానికి లోటు ఉండదు. ముఖ్యంగా మీరు వ్యాపారం చేస్తుంటే శుక్రవారాల్లో చక్కెర దానం చేయడం మానుకోండి. ఈ రోజు మీరు చక్కెర స‌హా ఇతర తెల్లని పదార్థాల‌ను దానం చేయకూడదు.

లక్ష్మీదేవికి ఇష్ట‌మైన‌ శుక్రవారం నాడు ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఇంట్లో అమ్మవారిని పూజించాలి. శుభ్రమైన ఇంట్లోనే లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. ఇల్లు అప‌రిశుభ్రంగా ఉంచితే ద‌రిద్రం వస్తుంది. ఈ కారణంగా ఇంటిని శుభ్రంగా, చక్కగా ఉంచాలి.

శుక్రవారం మ‌ద్యం, మాంసం తినవద్దు. ఈ రోజు సాత్విక ఆహారం తీసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజున మీరు శాకాహారం తప్ప మరే ఇతర ఆహారాన్ని తినకూడదు. ఈ రోజు మీ నోటి నుంచి ఎలాంటి ప‌రుష‌మైన పదాలు లేదా చెడ్డ మాట‌లు రాకుండా చూసుకోవడం మంచిది. ఈ రోజున ఎవరితోనూ వివాదాలు పెట్టుకోవద్దు. శుక్రవారం మీరు మాట్లాడేట‌ప్పుడు సంయమనం పాటించాలి. చెడు మాటలు మాట్లాడే వారిపై లక్ష్మీ దేవి కోపగించుకుంటుంది. ప‌రుష ప‌దాలు మాట్లాడేవారెవరూ ఆమె అనుగ్రహాన్ని పొందలేరు.

అలాగే మనం శుక్రవారం ఎవరికైనా రుణం ఇస్తే అది రుణదాత, రుణగ్రహీత ఇద్దరిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. శుక్రవారం ఎవరికైనా అప్పు ఇస్తే మీ ఇంటి లక్ష్మిని వేరొకరి ఇంటికి పంపుతున్నట్లు అర్థం. ఈ రోజు మీరు అప్పు తీసుకుంటే మీరు వేరొకరి ఇంటి లక్ష్మిని తీసుకున్నారని అర్థం. ఇది లక్ష్మీదేవి వెళ్లే ఇంటికి గాని, వచ్చిన ఇంటికి గాని మేలు చేయదు. ఇది రుణగ్రహీతలు, రుణదాతలు ఇద్దరికీ సమస్యలను సృష్టిస్తుంది.

Also Read:  Health Benefits: అంజూర పండ్లు తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు గురించి మీకు తెలుసా.?