Garuda Panchami : ఈనెల 9న గరుడ పంచమిని మనం జరుపుకోబోతున్నాం. ఈసందర్భంగా జాతకంలో ఉండే రాహుకేతు దోషాలతో పాటు కాలసర్పదోషం, గ్రహదోషాలను తొలగించుకునేందుకు పాములను పూజిస్తారు. ఈ పూజల వల్ల పెళ్లి, సంతానానికి సంబంధించిన సమస్యలు సమసిపోతాయని విశ్వసిస్తారు.
We’re now on WhatsApp. Click to Join
గరుడ పంచమిని కొన్ని ప్రాంతాల్లో కార్తీక శుద్ధ చవితి రోజు, ఇంకొన్ని ప్రాంతాల్లో శ్రావణశుద్ధ చవితి రోజు నిర్వహిస్తుంటారు. తెలంగాణ, రాయలసీమల్లో శ్రావణశుద్ధ చవితి రోజే గరుడ పంచమిని (Garuda Panchami) జరుపుకుంటారు. ఆ రోజున పాముల పుట్టలో పాలుపోసి పూజలు చేస్తారు. ఆగస్టు 9న గరుడ పంచమిని నిర్వహిస్తారు. శుక్రవారం రాత్రి 11 గంటల 49 నిమిషాల దాకా గరుడ పంచమి ఘడియలు ఉన్నాయి.
Also Read :Zodiac Signs : బుధుడి తిరోగమనం.. ఆ ఐదు రాశుల వారికి వ్యతిరేక ఫలితాలు
- ఎవరైనా పాములను హింసించి ఉంటే సర్పదోషం తగులుతుంది. దాని నుంచి విముక్తి లభించాలంటే గరుడ పంచమి రోజు పూజ చేయాలి.
- జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలన్నీ రాహు-కేతు మధ్య ఉంటే కాలసర్ప దోషం అంటారు. ఈ తరహా దోషం ఉన్నవారు కూడా తప్పకుండా గరుడ పంచమి రోజు పూజ చేయాలి.
- కొందరి తరుచుగా కలలో పాములు వస్తుంటాయి. పాములు తమను తరుముతున్నట్లుగా కొందరు కలలు కంటుంటారు. అలాంటి కలలు వచ్చేవాళ్లు కూడా గరుడ పంచమి రోజు ప్రత్యేక పూజలు చేయాలి.
- గరుడ పంచమి రోజు ఉప్పు, ఆవుమూత్రం నీళ్లలో కలిపి ఇంటిని శుభ్రం చేయాలి. గుగ్గిలంలో ఇల్లంతా ధూపం వేయాలి.
- వెండి లేదా రాగి పామును కొని దానికి పాలతో అభిషేకం చేసి నవనాగ నామస్తోత్రం పఠించాలి. చలిమిడి, చిమ్మలి నైవేద్యంగా సమర్పించాలి. దీని ద్వారా కాలసర్పదోష ప్రభావం , సర్పదోష ప్రభావం తగ్గుతుంది.
- ఇంట్లో పూజ అనంతరం శివాలయానికి వెళ్లి పూజ చేయాలి.
- గరుడ పంచమి రోజున భూమిని తవ్వొద్దు. వ్యవసాయ పనులు కూడా చేయొద్దు. నాగలిని వినియోగించకూడదు.
గమనిక : కొందరు నిపుణులు చెప్పిన, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా పైన ఉన్న సమాచారాన్ని అందించాం. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని రీడర్స్ గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.