Annakoot Mahotsav 2024 : ఉత్తరప్రదేశ్ వారణాసిలోని కాశీ విశ్వనాథుడు, అన్నపూర్ణ ఆలయాల్లో అన్నకూట్ మహోత్సవం నవంబరు 2న ఘనంగా జరిగింది. దానికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అన్నకూట్ అంటే సమృద్ధిగా ఉండే ఆహార ధాన్యాలు. ఈ పండుగ ప్రజల శ్రేయస్సు, భక్తికి ప్రతీక. ఈ వేడుకల్లో భాగంగా వివిధ స్వీట్లు, లడ్డూలు, రుచికర వంటకాలు సహా 56 రకాల నైవేద్యాలను శివుడు, అన్నపూర్ణాదేవీకి భక్తజనులు సమర్పించారు. అన్నపూర్ణా దేవి ఆలయంలో ఒక్కో గోడను 21 క్వింటాళ్ల లడ్డూలతో అలకరించారు. మాతా ఆలయ అలంకరణకు మరో 8 క్వింటాళ్ల లడ్డూను వాడారు. కాశీ విశ్వనాథుడి గుడిని 8 క్వింటాళ్ల లడ్డూలతో అందంగా తీర్చిదిద్దారు. మొత్తం మీద అన్నకూట్ మహోత్సవం వేళ అన్నపూర్ణ ఆలయానికి 511 క్వింటాళ్లు, విశ్వేశ్వరుని ఆలయానికి 14 క్వింటాళ్ల నైవేద్యంను భక్తులు అందజేశారు. పూజలన్నీ ముగిసిన తర్వాత భక్తులకు ఈ ప్రసాదాన్ని పంపిణీ చేశారు.
Also Read :Durgamma : 4 లక్షల గాజులతో వెలిగిపోయిన బెజవాడ దుర్గమ్మ
ఈసారి అన్నకూట్ మహోత్సవం కోసం దసరా నవరాత్రుల టైం నుంచే ఏర్పాట్లు మొదలయ్యాయి. అన్నపూర్ణ దర్బార్లో దాదాపు 85 మంది సిబ్బంది ప్రసాదాన్ని తయారు చేశారు. 40 రకాల స్వీట్లు, 17 రకాల నైవేద్యాలను రెడీ చేసి అందించారు. అన్నకూట్ సందర్భంగా కాశీ అన్నపూర్ణమ్మ దర్శనానికి అక్టోబరు 29 నుంచే భక్తులను అనుమతించారు.
Also Read :Union Minister : కేంద్ర మంత్రిపై కేసు.. జాతరకు అంబులెన్సులో వెళ్లినందుకు ప్రొసీడింగ్స్
దీపావళి మరుసటి రోజే శివుడు కాశీకి..
ఏటా కార్తీక మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి నాడు అన్నకూట్ పండుగను(Annakoot Mahotsav 2024) సెలబ్రేట్ చేస్తారు. ఏటా దీపావళి తర్వాతి రోజున గోవర్ధన్ పూజ నాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. దీపావళి మరుసటి రోజే శివుడు కాశీకి వచ్చాడని భక్తులు విశ్వసిస్తారు. శివుడికే అన్నపూర్ణాదేవీ భిక్ష వేశారని అంటారు. కాశీలో ప్రజలు ఎవరూ ఆకలితో ఉండకుండా అన్నపూర్ణ దేవి చూసుకుంటుందని నమ్ముతారు. అందుకే దీపావళి తర్వాతి రోజున వారణాసిలో అన్నకూట్ నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది.