శని గ్రహం (Saturn ) (శనిచరుడు) హిందూ జ్యోతిష్యం(Hindu Astrology)లో కీలకమైన గ్రహంగా భావించబడుతుంది. శని, సాధారణంగా కఠిన పరీక్షల, సవాళ్ల మరియు శ్రమను సూచిస్తుంది. మనిషి జీవితంలో శని ప్రభావం అనేది వ్యక్తి జాతకంలోని శని స్థానంతో పాటు దశా, అంతర్దశా, శని సారె (సాటర్న్ రిటర్న్) వంటి వాటి ఆధారంగా ఉంటుంది. శని ప్రభావం దాదాపుగా 2.5 ఏళ్లపాటు ఉంటుంది, దీనిని “శని సాడెసాతి” అంటారు.
శని ప్రభావం ఉన్నప్పుడు వ్యక్తికి శ్రమ, కష్టాలు అధికంగా ఉంటాయి. ఈ సమయంలో విజయాలు రావడం కష్టం కానీ కష్టపడితే మన్నింపు ఉంటుంది. శని ప్రేరేపణతో వ్యక్తి సరిగ్గా ఆలోచించటం, సరిగ్గా వ్యవహరించటం, నియమాలు పాటించటం నేర్చుకుంటాడు. శని కాలం జీవితంలో ఆత్మవికాసానికి మంచి సమయం అనిపించబడుతుంది. చాలామందికి శని ప్రభావం వల్ల ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. అయితే ఇది వ్యక్తిని ఆర్థిక నియంత్రణలో ఉండేలా చేస్తుంది. శని ప్రభావంలో క్రమశిక్షణ, సహనం, మరియు ధైర్యం అవసరం. ఇది వ్యక్తిని మరింత శక్తిమంతంగా మరియు సహనంతో ముందుకు నడిపిస్తుంది.
కాగా శని గ్రహణం అనేది వక్రమార్గం, సక్రమమార్గంలో వెళ్తుంటుంది. ఈ మార్గం వివిధ రాశులపై ప్రభావం చూపిస్తుంటుంది. అయితే, ఇప్పుడు శని వక్రమార్గంలో ఉండడంతో నవంబర్ 15 నుండి మూడు రాశుల వారికీ పట్టిందల్లా బంగారమే కాబోతుంది. ఉద్యోగాలు , వ్యాపారాలు , చదువులు , చేసే పనుల్లో ఇలా అన్నిట్లో విజయం తో పాటు సంపద రెట్టింపు అవ్వనుంది. మరి ఆ మూడు రాశులు ఏంటో చూద్దామా..!!
కన్యా రాశి (Kanya Rasi) :
కన్యా రాశి వారికీ శని వక్రమార్గం కారణంగా నవంబర్ 15 నుంచి జీవితం పూర్తిగా మారిపోనుంది. సడెన్ గా ధనలాభం కలుగుతుంది. చిరు వ్యాపారులకు లాభాలు , కొత్తగా వ్యాపారం మొదలు పెట్టేందుకు ఇది మంచి సమయం. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది. పెండింగులో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు.
వృశ్చిక రాశి (Vrushchika Rasi)
నవంబర్ 15 నుంచి ఈ రాశి వారికీ పట్టిందల్లా బంగారం కానుంది. ఆర్ధిక సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. పెద్దవారి ఆరోగ్యం పట్ల కాస్త జాగత్తలు తీసుకోవాలి.
కుంభ రాశి (Kumbha Rasi)
కుంభ రాశి వారికీ కూడా నవంబర్ 15 నుంచి కలిసి వస్తుంది. ఈ రాశి వారు మొదలు పెట్టిన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగులకు, విద్యార్ధులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా, వ్యాపారాలు చేసే వారికీ లాభాలు వస్తాయి. కొత్తగా ఉద్యోగం చేసే వారికీ జీతాలు పెరగుతాయి. ఇలా మొత్తం మీద ఈ మూడు రాశుల వారికీ నవంబర్ 15 నుండి బాగా కలిసివస్తుంది.
Read Also : Gambhir Press Conference: రోహిత్- కోహ్లీ ఫామ్‌లపై గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఓపెనింగ్‌లో మార్పులు!