Ram Temple: 5 వేల వజ్రాలతో రామ మందిరం నెక్లెస్.. సూరత్ వ్యాపారి బహుమతి

ఉత్తరప్రదేశ్‌లో నిర్మించిన అయోధ్య రామ మందిరాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి రామమందిరం కోసం వజ్రాల హారాన్ని తయారు చేసి తన భక్తిని చాటుకున్నారు.

Published By: HashtagU Telugu Desk
Ram Temple

Ram Temple

Ram Temple: ఉత్తరప్రదేశ్‌లో నిర్మించిన అయోధ్య రామ మందిరాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి రామమందిరం కోసం వజ్రాల హారాన్ని తయారు చేసి తన భక్తిని చాటుకున్నారు. దీనికి సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయోధ్య రామమందిర నిర్మాణాన్ని పోలి ఉండే డైమండ్ నెక్లెస్ కోసం 2 కిలోల వెండితో పాటు ఈ నెక్లెస్ డిజైన్‌లో 5000 అమెరికన్ వజ్రాలు ఉపయోగించారు. ఈ హారంలో రాముడు, లక్ష, సీత మరియు హనుమంతుడిని కూడా చూడవచ్చు. ఈ డిజైన్‌ను 40 మంది కళాకారులు 35 రోజుల్లో పూర్తి చేశారు. ఇది ఏ వాణిజ్య ప్రయోజనం కోసం కాదని, రామమందిరానికి బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నానని వజ్రాల వ్యాపారి చెప్పారు.

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామమందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న ఆలయ సంప్రోక్షణకు తేదీగా నిర్ణయించారు. ఈ మహాక్రతువుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. ఈ క్రమంలో తొలి వంద రోజుల్లో అయోధ్యకు 1,000 రైళ్లను నడపాలని భారతీయ రైల్వే యోచిస్తోంది. ఈ రైళ్లు జనవరి 19 నుంచి ప్రారంభం కానుండగా.. జనవరి 22న మర్నాడు నుంచి భక్తులను ఆలయంలోకి అనుమతిస్తారు.

Also Read: Minister Roja : నగరి టికెట్ ఫై మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

  Last Updated: 19 Dec 2023, 02:56 PM IST