రేపు నాగ పంచమి..ప్రతి ఏడాది శ్రవణ మాసం శుక్ల పక్షంలోని ఐదవ రోజున నాగ పంచమి పండుగను భక్తులు జరుపుకుంటారు. నాగ పంచమి రోజున శివునితో పాటు నాగదేవతను పూజిస్తే మంచి జరుగుతుందని, అనేక దోషాలు పోతాయని భక్తుల నమ్మకం. ఈ ఏడాది రేపు ( ఆగస్టు 9వ తేదీ ) శుక్రవారం నాగ పంచమి పండుగను జరుపుకోబోతున్నాం. ఈసారి నాగపంచమికి ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఈ పర్వదినాన ఏకాకాలంలో సిద్ధి యోగం, రవి యోగం, అమృత యోగం ప్రభావంతో ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయని జ్యోతిష్యనిపుణులు చెపుతున్నారు. మేష రాశి(Aries),కర్కాటక రాశి(Cancer),సింహ రాశి(Leo),కుంభ రాశి(Aquarius) ఏ రాశుల వారికీ ఎంతో శుభం కలగబోతుందట.
అలాగే వేద పంచాంగం ప్రకారం శ్రావణ మాస శుక్ల పక్ష నవమి తిథి ఆగష్టు 8 అర్థరాత్రి 12:36 గంటలకు (అనగా ఆగస్టు 9వ తేదీ ఉదయం 00:36 గంటలకు) ప్రారంభమై తెల్లవారుజామున 3 గంటలకు ముగుస్తుంది. మరుసటి రోజు ఆగస్టు 10వ తేదీ 14:00 గంటలకు ముగుస్తుంది. అందుకే ఈ ఏడాది ఆగస్టు 9న నాగ పంచమి పండుగను జరుపుకోనున్నారు. ఈ రోజున ఉదయం 6.01 గంటల నుండి 8.37 గంటల వరకు పూజలు నిర్వహించడానికి శుభ సమయం. ఈ సమయంలో శివయ్యతో పాటు నాగ దేవతను పూజించుకోవచ్చని చెపుతున్నారు.
అసలు నాగపంచమి రోజు (Naga Panchami 2024) ఏంచేయాలంటే :
నాగ పంచమి రోజున తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేయాలి. అనంతరం పూజా మందిరంలో నాగదేవతలను పూజించడం వల్ల శివయ్య అనుగ్రహం లభిస్తుందని చాలా మంది నమ్మకం. నాగ దేవతకు పూజ చేయాలనుకునే వారు ముందుగా పూజ చేసే ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవాలి. అనంతరం ఎర్రని వస్త్రాన్ని పరచి, దానిపై నాగ దేవత ఫోటో ఉంచాలి. అనంతరం కుంకుమ, పసుపు కలిసిన అక్షింతలు(బియ్యం) తిలకంగా తయారు చేసుకోవాలి. అనంతరం పూలు సమర్పించాలి. ఆ తర్వాత దీపారాధన చేయాలి. నాగు పాము విగ్రహానికి నీరు మరియు పాలాభిషేకం చేయాలి. అనంతరం నాగదేవతకు పాలు, పంచదారను నైవేద్యంగా సమర్పించాలి. అనంతరం నాగదేవత కథను చదవాలి.
నాగ పంచమి (Naga Panchami 2024) రోజు చేయకూడని పనులు :
నాగ పంచమి రోజున భూమిని తవ్వడం వంటి పనులు అస్సలు చెయ్యకూడదని జోతిష్యం చెపుతుంది. ముఖ్యంగా పాము పిల్లలు ఉన్న చోట ఇలా అస్సలు చేయొద్దు. ఎక్కడైనా పాము కనిపిస్తే దాన్ని ఇబ్బంది పెట్టకూడదు. ఆ సమయంలో నాగదేవతకు నమస్కారం చేయడం వల్ల అది అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఈ పర్వదినాన పదునైన వస్తువులు వాడకండి. అలాగే నాగ పంచమి రోజున సంధ్యా సమయంలో పొరపాటున కూడా పాము పేర్లను పలకకూడదని పండితులు చెబుతున్నారు.
Read Also : Samantha : సమంత కెరీర్ లోనే హయ్యెస్ట్ రెమ్యునరేషన్..!