Site icon HashtagU Telugu

COVID Cases : దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. అలెర్ట్ చేసిన కేంద్రం..

New Covid Variant FLiRT

Covid Cases Are Increasing In The Country.. Center Alerted..

COVID Cases : దేశంలో కరోనా పంజా విసురుతుంది. రోజురోజుకి కేసులు పెరుగుతుండటంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కేసుల సంఖ్య లెక్కకుమించి అధికమవుతుండటంతో ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి. చాపకింద నీరులా విస్తరిస్తున్న కోవిడ్ కేసులను (COVID Cases) నివారించే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే ఆస్పత్రుల్లో అవసరం మేర బెడ్ లను ఏర్పాటు చేశాయి. రోగులకు సరిపడా మెడిసిన్ ను రెడీ చేస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ అలెర్ట్ అయింది. ఇప్పటికే రాష్ట్రప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కరోనా హాట్ స్పాట్ లను గుర్తించి, పాజిటివ్ కేసులకు అడ్డుకట్ట వేసే దిశగా నిర్ణయాలు తీసుకోవాలని సూచింది. వివరాలలోకి వెళితే..

ప్రస్తుతం దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నాయి. ఈ మేరకు తాజాగా నమోదైన కోవిడ్ కేసుల వివరాలను బయటపెట్టింది కేంద్ర ఆరోగ్యశాఖ. గత 24 గంటల్లో 6,155 కోసులు నమోదైనట్లు, అలాగే శుక్రవారం 6050 మంది కోవిడ్ భారీన పడ్డట్లు తెలిపింది. ఇదిలా ఉండగా గతేడాది సెప్టెంబర్‌ 16న 6,298 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశంలో కరోనా బాధితుల సంఖ్య 4,47,51,259కి చేరింది. ఇందులో 5,30,954 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 31,194 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 11 మంది కరోనా రోగులు మరణించారు.

2019లో చైనాలో పురుడుపోసుకున్న కరోనా వైరస్ ప్రపంచాన్నే చుట్టేసింది. లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకుంది. కోట్లాది మంది ప్రజలు దీని భారీన పడ్డారు. ఎంతోమంది తమ ఆత్మీయులను పోగొట్టుకున్నారు. కరోనా వైరస్ ని నివారించేందుకు ప్రపంచ దేశాలన్నీ ఏకమయ్యాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం కరోనా వైరస్ మళ్ళీ విస్తరిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖా రంగంలోకి దిగింది. కరోనా రోగులను త్వరితగతిన గుర్తించి ఐసోలేషన్ చేయాలనీ, పాజిటివ్ కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

Also Read:  Trolls: నాడు ట్రోల్.. నేడు జేజేలు