Coronavirus: మళ్ళీ విజృంభిస్తున్న కరోనా… చైనాలో కొత్తగా కేసులు

కోవిడ్ 19 తో ప్రపంచం ఉక్కిరిబిక్కిరి అయింది. చైనాలో పురుడుపోసుకున్న ఈ మహమ్మారి వ్యాధి ప్రపంచమంతా పాకింది. దీంతో కోట్లాది మంది ప్రాణాలు కోల్పోయారు.

Coronavirus: కోవిడ్ 19 తో ప్రపంచం ఉక్కిరిబిక్కిరి అయింది. చైనాలో పురుడుపోసుకున్న ఈ మహమ్మారి వ్యాధి ప్రపంచమంతా పాకింది. దీంతో కోట్లాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఎందరో కరోనాని జయించి బ్రతుకు జీవుడా అంటూ గడిపారు. ఇక లాక్ డౌన్ పేరుతో ప్రభుత్వం ప్రపంచానికి తాళం వేసింది. దీంతో ఆకలిచావులు సంభవించాయి. ఆ రోజులు తలుచుకుంటేనే ప్రాణం భయం వెంటాడుతుంది. ప్రస్తుతం కరోనా సమస్య ఉన్నప్పటికీ మరణాల రేటు చాలా వరకు తగ్గింది. అయితే చైనాలో తాజా రిపోర్ట్ మళ్ళీ వణుకు పుట్టిస్తుంది.

చైనాలో మరోసారి కరోనా కేసులు విజృంభించాయి. రోజురోజుకి కరోనా రోగులు ఆస్పత్రికి బారులు తీరుతున్నారు. దీంతో చైనాలో అన్ని ఆస్పత్రులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఐసోలేషన్ లో ఉంచాలని, మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించింది. అయితే అక్కడ లాక్ డౌన్ విధించే అవకాశం లేదు. గతంలో కరోనా కేసులు ఎక్కువ అయిన క్రమంలో చైనా ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. అయితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. దాన్ని దృష్టిలో ఉంచుకుని అక్కడి ప్రభుత్వం లాక్ డౌన్ జోలికి వెళ్లడం లేదు.

చైనాలో COVID-19 కేసులు మళ్లీ పెరుగుతున్నాయని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. అయితే ఈసారి ప్రభుత్వం ఆర్థిక వృద్ధిపై దృష్టి సారించినందున దేశం సాధారణ జీవితాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఇకపై నో లాక్ డౌన్ అని పేర్కొంది. చైనీస్ ఆరోగ్య అధికారులు ఏప్రిల్ నుండి కోవిడ్ కేసుల పెరుగుదలను నివేదించారు.

Read More: First Chinese Into Space : అంతరిక్షంలోకి ఆ ప్రొఫెసర్.. ఎందుకంటే ?