Yuvraj Singh Biopic : యువరాజ్ సింగ్.. ప్రపంచ క్రికెట్ లెజెండ్. క్రికెట్‌లో భారత్ గర్వించేలా చేసిన స్టార్ ప్లేయర్. ప్రస్తుతం ఆయన 42 ఏళ్ల వయసులో క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. యువరాజ్ సింగ్ జీవితం గురించి, క్రికెట్ లైఫ్ గురించి తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. అందుకే ఆయన బయోపిక్‌ను తీసుకొచ్చే విషయంపై తాజాగా క్లారిటీ వచ్చింది. వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
యువరాజ్‌సింగ్ బయోపిక్‌ను ప్రఖ్యాత బాలీవుడ్ నిర్మాణ సంస్థ ‘టీ సిరీస్’(Yuvraj Singh Biopic) నిర్మించనుంది. ఈవిషయాన్ని నిర్మాతలు భూషణ్ కుమార్, రవిభాగ్ చందక్ వెల్లడించారు. యూవీ బయోపిక్‌లో హీరో ఎవరు ? ఆ సినిమాకు డైరెక్షన్ చేయబోయేది ఎవరు ? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని నిర్మాతలు చెప్పారు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ జీవితంపై నిర్మించిన ‘సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్’ డాక్యుమెంటరీ నిర్మాణంలోనూ రవిభాగ్ చందక్ భాగస్వామిగా ఉన్నారు. ఇప్పుడు మూవీ ఇండస్ట్రీలో బయోపిక్‌లు బాగానే ఆడుతున్నాయి. వాటిని చూసేందుకు సినీ ప్రియులు బాగానే ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పుడు యువరాజ్ సింగ్ బయోపిక్‌కు కూడా మంచి స్పందనే వస్తుందని అంచనా వేస్తున్నారు. గతంలో సచిన్, ధోనీ క్రికెట్ లైఫ్‌పై తీసిన మూవీ బాగానే ఆడింది.
- యువరాజ్‌సింగ్ 13 ఏళ్ల వయసులో పంజాబ్ అండర్ 16 క్రికెట్ జట్టకు ఎంపికయ్యారు.
- 2000 సంవత్సరంలో అండర్ 19 వరల్డ్ కప్ జట్టుకు యూవీ ఎంపికయ్యారు. ఇందులో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును ఆయన కైవసం చేసుకున్నారు.
- టీమ్ ఇండియాకు ఎంపికైన యూవీ.. 2007 సంవత్సరంలో టీ20 వరల్డ్ కప్‌ను భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. ఈ టోర్నీలోనే యూవీ ఒకే ఓవర్‌లో ఆరు సిక్సులు బాది సరికొత్త రికార్డు సృష్టించాడు.
- 2011లో యూవీకి క్యాన్సర్ నిర్ధారణ అయింది. ఆయన ధైర్యంతో క్యాన్సర్‌ను జయించారు.
- ఆ తర్వాత మళ్ళీ క్రికెట్ గ్రౌండ్‌లోకి యూవీ అడుగుమోపారు.