జానీ మాస్టర్ (Jani Master) పై అత్యాచారం కేసు పెట్టిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ తనను లైంగికంగా వేధించిందంటూ ఓ యువకుడు నెల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన మామ జానీ మాస్టర్ తో కలిసి హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్లకు వెళ్లినప్పుడు ఆమె లిఫ్ట్, రెస్ట్ రూమ్, లాడ్జిలో తనపై లైంగిక దాడి చేసి, నగ్న ఫొటోలు తీసి బెదిరించిందన్నాడు. అప్పుడు తాను మైనర్ నని చెప్పుకొచ్చాడు. వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. మరి ఈ యువకుడి పిర్యాదు లో ఎంత నిజం ఉందనేది చూడాలి.
కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం కేసు నేపథ్యంలో జానీ మాస్టర్ కి జాతీయ అవార్డును నిలిపివేశారు. అంతకుముందు రంగారెడ్డి కోర్టు ఆయనకు అవార్డు తీసుకోవడానికి 4 రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ అవార్డు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో జానీమాస్టర్ బెయిల్ ను రద్దు చేయాలంటూ పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. బెయిల్ విచారణ పై ఈ నెల 14 కు కోర్ట్ వాయిదా వేసింది.
అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడి ఆరోపణలు ఎదురుకుంటున్న జానీ మాస్టర్‌ను గత నెలలో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గోవాలో జానీ మాస్టర్‌ను రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోవా స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి పీటీ వారెంట్ తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. రాజేంద్రనగర్ సర్కిల్ ఉప్పర్‌పల్లిలోని 13వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరిచారు. పోలీసులు సమర్పించిన ఆధారాలను పరిశీలించి, ఇరువర్గా ల వాదనలూ విన్న న్యాయమూర్తి.. జానీకి (14 రోజుల) రిమాండ్ విధించారు.
Read Also : Tamil Nadu Train Accident : గూడ్స్‌ను ఢీకొట్టిన ఎక్స్‌ప్రెస్.. 19 మందికి గాయాలు, పట్టాలు తప్పిన 12 బోగీలు