ఎక్కడ చూడు మహిళలప్ దాడులు , అత్యాచారాలు ఎక్కువై పోతున్నాయి. ఎన్ని చట్టాలు , కోర్టులు ఎన్ని శిక్షలు విదిస్తున్నప్పటికీ కామాంధుల్లో , కొంతమంది మగవారిలో మార్పు అనేది రావడం లేదు. కొంతమంది తమ కామ కోర్కెలు తీర్చుకునేందుకు చూస్తుంటే..మరికొంతమంది ప్రేమ పేరుతో దాడులు చేస్తూ వస్తున్నారు. ప్రతి రోజు ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ లో సినీ నటి ఫై ఇలాంటి దాడే జరిగింది.
We’re now on WhatsApp. Click to Join.
సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ లు చేస్తూ ఉండే యువతికి..శ్రీనగర్‌కాలనీ గణపతి కాంప్లెక్స్‌లో నివసించే గంగినేని గణేష్‌తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కొద్దీ నెలల పాటు ఇద్దరు చెట్టాపట్టాలేసుకుంటూ తిరిగారు. ఆ తర్వాత వీరిమధ్య విభేదాలు రావడం తో సదరు యువతీ మూసాపేటలోని ఆంజనేయనగర్‌లో ఉంటుంది.
ఈ క్రమంలో ఈ నెల 7న యువతికి పోన్ చేసిన గణేష్.. చిలుకూరు బాలాజీ గుడిలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన ఇంటికి రప్పించాడు. ఇంటికి వచ్చిన యువతిని గణేష్ తన సోదరులు శ్రీను, వంశీ, శ్రీకాంత్, అక్షయ్‌తో కలిసి మైత్రీవనం ప్రాంతానికి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టడంతో పాటు ఫోన్‌ను ధ్వంసం చేశాడు. దీంతో బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు పిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు గణేష్‌తో పాటు శ్రీను, వంశీ, శ్రీకాంత్, అక్షయ్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం గణేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Read Also : Director Sukumar Birthday Special : లెక్కల మాస్టారు..లెక్క తప్పేదెలా..