Rocky Bhai Gun Firing: రాఖీ భాయ్ గన్ పడితే.. బుల్లెట్ దిగాల్సిందే!

యష్ హీరోగా నటించిన కేజీఎఫ్1, 2 చిత్రాలు ఎంతటి సంచలనాలు కల్గించాయో అందరికీ తెలిసిందే.

  • Written By:
  • Updated On - September 29, 2022 / 05:25 PM IST

యష్ హీరోగా నటించిన కేజీఎఫ్1, 2 చిత్రాలు ఎంతటి సంచలనాలు కల్గించాయో అందరికీ తెలిసిందే. రాఖీ భాయ్ పాత్రలో అద్భుతంగా నటించి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. యాక్షన్ ప్రియులందరికీ ఈ సినిమా గొప్ప ట్రీట్‌గా నిలిచింది. ముఖ్యంగా హీరో గన్ వాడే విధానం అభిమానులను మెస్మరైజ్ చేసింది.

రాకీ భాయ్ పాత్రలో హీరో యష్ తన గన్స్ అధీర బెటాలియన్‌ను ఏవిధంగా చెల్లాచెదురు చేశాడో ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతుంది. హీరో యశ్ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో లెటెస్ట్ వీడియో వైరల్ గా మారింది. ప్రాక్టీస్ సెషన్‌లో కలాష్నికోవ్  గన్ తో ప్రాక్టీస్ చేస్తున్న వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. హీరో యష్ ఏమాత్రం గురి తప్పకుండా టార్గెట్ ఫినిష్ చేయడం వీడియోలు చూడొచ్చు.

ప్రఖ్యాత అమెరికన్ డైరెక్టర్-మార్షల్ ఆర్టిస్ట్-స్టంట్‌మ్యాన్, JJ పెర్రీతో కలిసి లాస్ ఏంజెల్స్‌లో టార్గెట్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను షేర్ చేశాడు హీరో యశ్. కేజీఎఫ్ హిట్ తర్వాత హాలీవుడ్ దర్శకుడు యష్ నటనకు ఫిదా అయ్యాడు. “లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎల్లప్పుడూ ఒక మార్గం ఉంటుంది, దానిని గుర్తించడమే సవాలు! నా ట్రైనర్ కు చాలా థ్యాంక్స్ @jjlocoperry, ఎంత అద్భుతమైన రోజు!! అంటూ హీరో యష్ ఇన్ స్టాలో రియాక్ట్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ‘‘దటీజ్ రాఖీభాయ్’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.