Site icon HashtagU Telugu

Expensive Web Series: రూ.36 వేల కోట్లతో అత్యంత ఖరీదైన వెబ్ సిరీస్.. విశేషాలివీ

Worlds Most Expensive Web Series The Lord Of The Rings Harry Potter

Expensive Web Series: వెబ్ సిరీస్‌లకు ఈ మధ్య భారీగా క్రేజ్ పెరిగింది. సినీ ప్రియులు ఎగబడి మరీ వెబ్‌సిరీస్‌లు చూస్తున్నారు. కొంతమందైతే మంచి వెబ్ సిరీస్‌లను చూడటానికే ఓటీటీ వేదికల్లో సబ్‌స్క్రిప్షన్లు తీసుకుంటున్నారు. దీన్నిబట్టి వాటిని ఎంతగా జనం ఫాలో అయిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. జనాన్ని కనెక్ట్ చేసుకొని కట్టి పడేయగల స్టోరీలు ఉంటే అలాగే ఉంటుంది మరి. త్వరలో ఒక మెగా వెబ్ సిరీస్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేయబోతోంది.  అత్యధిక బడ్జెట్‌తో ప్రపంచంలోనే కాస్ట్లీ వెబ్ సిరీస్‌ను(Expensive Web Series) తీయబోతున్నారు.  ఆ వివరాలపై ఒక లుక్ వేద్దాం..

Also Read :Coca-Cola India : ‘మైదాన్ సాఫ్’ ప్రచారంపై డాక్యుమెంటరీని ప్రసారం చేయనున్న డిస్కవరీ ఛానల్

ఖరీదైన వెబ్ సిరీస్ విశేషాలివీ.. 

  • ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అత్యధిక బడ్జెట్ కలిగిన వెబ్ సిరీస్ నిర్మాణం త్వరలోనే మొదలు కాబోతోంది.
  • దీని కోసం ఏకంగా రూ.36 వేల కోట్ల బడ్జెట్‌ను రెడీ చేస్తున్నారట.
  • ఈ వెబ్ సిరీస్‌లోని ఒక్కో ఎపిసోడ్ చిత్రీకరణకు ఏకంగా రూ.850 కోట్ల దాకా ఖర్చవుతాయట.
  • సినిమాల బడ్జెట్‌లు వందల కోట్లలో ఉంటే.. ఈ  వెబ్ సిరీస్ బడ్జెట్ వేల కోట్లకు చేరడంపై ఇప్పుడు అంతటా చర్చలు జరుగుతున్నాయి.
  • జేకే రౌలింగ్ రాసిన ప్రఖ్యాత హ్యారీ పోటర్ పుస్తకాల ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌ను తీయబోతున్నారట. జేకే రౌలింగ్ మొత్తంగా 7 పుస్తకాలు రాశారు. ఈ ఒక్కో పుస్తకాన్ని ఒక్కో సీజన్‌గా తీసుకురాబోతున్నారు.
  • ఈ వెబ్ సిరీస్‌లో మొత్తం 7 సీజన్లు ఉంటాయట. ఒక్కో సీజన్‌లో 6  ఎపిసోడ్లు ఉంటాయట.
  • జేకే రౌలింగ్ రాసిన ఒక్కో పుస్తకం ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌‌‌లోని ఒక్కో సీజన్‌ను  తెరకెక్కించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
  • ఈ హ్యారీ పోటర్ వెబ్ సిరీస్ కోసం మొత్తంగా ఒక మినీ సిటీనే నిర్మించబోతున్నారట. ఇందుకోసం రూ.11 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారట.  హ్యారీ పోటర్ పుస్తకాల్లో ఉండే అన్ని ప్రముఖ లొకేషన్లను ఆ సిటీ పరిధిలో నిర్మిస్తున్నారు.
  • 2026 సంవత్సరంలో ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన తొలి సీజన్ రిలీజయ్యే ఛాన్స్ ఉంది.
  • ఇప్పటికే హ్యారీ పోటర్ పుస్తకాలపై 8 మూవీస్ వచ్చాయి. అయితే ఈ వెబ్ సిరీస్ మరింత లోతుగా వాటిని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుందట.
  • ఇప్పటి వరకు భారీ బడ్జెట్ రికార్డు ‘‘ది లార్డ్ ఆఫ్ ద రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్’’  పేరిట ఉంది. దాన్ని దాదాపు రూ.8500 కోట్లతో తెరకెక్కించారు. ఒక్కో ఎపిసోడ్ చిత్రీకరణకు రూ.530 కోట్లు ఖర్చు చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇది స్ట్రీమ్ అవుతోంది.