Richest South Actress: సౌత్ రిచెస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా?

బాలీవుడ్ నటులే కాదు.. మాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ నుంచి సౌత్ సెలబ్రిటీలు కూడా టాప్ రిచ్ స్టార్స్‌లో ఉన్నారు.

Published By: HashtagU Telugu Desk
Heroines

Heroines

బాలీవుడ్ నటులే కాదు.. మాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ నుంచి సౌత్ సెలబ్రిటీలు కూడా టాప్ రిచ్ స్టార్స్‌లో ఉన్నారు. సౌతిండియా ఇండస్ట్రీకి ప్రపంచవ్యాప్తంగా భారీ మార్కెట్‌ను ఉంది. తమ తమ పాపులారీటితో ప్రేక్షకులను సులభంగా ఆకర్షించే సత్తా సౌత్ హీరోయిన్స్ కు ఉంది.  బాక్సాఫీస్ హిట్స్ అందించడమే కాకుండా, ఎండార్స్‌మెంట్ ఒప్పందాలతోను దూసుకుపోతున్నారు. సౌత్ హీరోయిన్స్ ధనవంతుల జాబితాలో నయనతార ముందుంది. నికర విలువ దాదాపు రూ. 165 కోట్లు. సౌత్‌లో అతిపెద్ద మహిళా సూపర్‌స్టార్‌లలో నయన్‌ ఒకరు. 2003 మలయాళ చిత్రం మనస్సినక్కరేతో ఆమె అరంగేట్రం చేసినప్పటి నుండి ఆమె తమిళ, తెలుగు, మలయాళ సినిమాలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం కోలివుడ్ ను శాసిస్తూ టాప్ స్టార్ గా వెలుగొందుతోంది.

టాప్ 5 సౌత్ నటీమణులు

నయనతార – నికర విలువ 165 కోట్లు

తమన్నా – నికర విలువ 110 కోట్లు

అనుష్క శెట్టి – నికర విలువ 100 కోట్లకు పైగా ఉంది

సమంతా – నికర విలువ 89 కోట్లు

పూజా హెగ్డే – నికర విలువ 50 కోట్లు

రష్మిక మందన్న – నికర విలువ 28 కోట్లు

  Last Updated: 06 Jul 2022, 03:21 PM IST