Site icon HashtagU Telugu

Samantha : హైదరాబాద్ కు రాబోతున్న సమంత..సురేఖ వ్యాఖ్యలపై స్పందిస్తారా..?

Surekha Sam

Surekha Sam

చాల రోజుల తర్వాత నటి సమంత (Samantha) హైదరాబాద్ (Hyderabad) కు రాబోతుంది. నాగ చైతన్య తో విడాకులు , ఆ తర్వాత అనారోగ్యానికి గురి కావడంతో సమంత ఎక్కువగా ముంబై లోనే ఉంటుంది. సినిమా షూటింగ్స్ , ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం మాత్రమే హైదరాబాద్ కు వస్తుంది. ఇప్పుడు మరోసారి హైదరాబాద్ లో సామ్ సందడి చేయబోతుంది.

అలియా భ‌ట్‌, వేదాంగ్ రైనా ప్ర‌ధాన పాత్ర‌ల్లో.. వాస‌న్ బాలా ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన మూవీ జిగ్రా (Jigra). క‌ర‌ణ్ జోహార్ నిర్మించిన ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 11 న హిందీ తో పాటు తెలుగు లో విడుదల కాబోతుంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్ లో భాగంగా మేకర్స్ ఈరోజు (అక్టోబర్ 08) హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను పార్క్ హయత్ లో ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ఈవెంట్ కు సమంత ముఖ్య అతిదిగా హాజరుకాబోతున్నారు. దీంతో అందరి చూపు సమంత పై పడ్డాయి. దీనికి కారణం మంత్రి కొండా సురేఖ ఇటీవల చేసిన కామెంట్లే.

నాగ చైతన్య – సమంత ( Naga Chaitanya – Samantha Divorce ) విడిపోవడానికి కారణం కేటీఆర్ అని , N కన్వెన్షన్ (N Convention) కూల్చకుండా ఉండాలంటే సమంత ను తన దగ్గరికి పంపాలని కేటీఆర్ డిమాండ్ చేయడం తో.. నాగార్జున..సమంత ను కేటీఆర్ దగ్గరికి వెళ్లాలని ఫోర్స్ చేసాడు..కానీ సమంత ఒప్పుకోలేదు…అలాంటి పని చేయనంటే..చేయనని తేల్చి చెప్పడం తో..కుటుంబంలో గొడవలు జరిగాయి. కేటీఆర్ దగ్గరికి వెళ్లకపోతే మా ఇంట్లో ఉండొద్దని నాగార్జున తెచ్చి చెప్పడంతో..ఆ పని చేయలేక సమంత విడాకులు తీసుకుంది. నాగ చైతన్య – సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే అని తేల్చి చెప్పింది.

ఈమె చేసిన వ్యాఖ్యలను సమంత తో పాటు అక్కినేని ఫ్యామిలీ ఖండించింది. ఆ తర్వాత కొండా సురేఖ తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఈరోజు హైదరాబాద్ కు రాబోతున్న సమంత…కొండా సురేఖ చేసిన కామెంట్స్ పై ఏమైనా స్పందిస్తారా..? స్పందిస్తే ఎలాంటి రియాక్షన్ ఉంటుంది..? అనేదాని కోసం మీడియా తో పాటు అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Read Also : Feroze Khan : కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ పై దాడి