Site icon HashtagU Telugu

Keerthy Suresh: సరైన సమయంలో నా మిస్టరీ మ్యాన్ ను పరిచయం చేస్తా: పెళ్లిపై కీర్తి సురేశ్ రియాక్షన్!

Keerthy suresh pics

Keerthy

ఇటీవలే తెలుగు పీరియడ్ యాక్షన్-డ్రామా దసరాలో కనిపించిన కీర్తి సురేష్ (Keerthy Suresh) దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. గత  కొన్నిరోజులుగా కీర్తి పెళ్లి గురించి వార్తలు వినిపిస్తునే ఉన్నాయి. అంతేకాదు. ఫర్హాన్ అనే వ్యక్తితో కీర్తి ఉన్న ఫోటో వైరల్ అయినప్పటి నుండి, వారు రిలేషన్‌షిప్‌లో ఉన్నారని వార్తలు బయటకు వచ్చాయి.

వీరిద్దరూ పెళ్లి (Marriage) చేసుకోబోతున్నారని కూడా రూమర్స్ వినిపించాయి. ఈ నేపథ్యంలో తనపై పెళ్లి పై వస్తున్నరూమర్స్ పై రియాక్ట్ అయ్యింది కీర్తి సురేశ్. తాను కోరుకున్నప్పుడే పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరో అనేది తెలియజేస్తానని వెల్లడిస్తానని పేర్కొంది. “హహహ!! నా ప్రియమైన స్నేహితుడిని పెళ్లి విషయంలో లాగాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నా జీవితంలో ఎవ్వరూ లేరు. నిజమైన మిస్టరీ మ్యాన్‌ని (భర్త) సరైన సమయంలోనే పరిచయం చేస్తాను. అప్పటి వరకు చిల్ అవ్వండి’’  అంటూ రియాక్ట్ అయింది. కీర్తి చివరిసారిగా దసరాలో కనిపించింది.

ఈ చిత్రంలో ఆమె వెన్నెల పాత్రను పోషించింది. చాలా రోజుల తర్వాత భారీ హిట్ ను తన ఖాతాలోవేసుకుంది. ఒదెల శ్రీకాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నానితో కలిసి నటించింది. దసరా షూటింగ్ చివరి రోజున కీర్తి సిబ్బందికి 130 బంగారు నాణేలను (Gold Coins) బహుమతిగా ఇచ్చింది. బంగారు నాణేల విలువ రూ. 70 లక్షలు. డ్రైవర్లు, లైట్ బాయ్‌లతో సహా 130 మంది సిబ్బందికి కీర్తి ఒక్కొక్కరికి బంగారు నాణెం ఇచ్చింది. దసరా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ₹100 కోట్లకు పైగా వసూలు చేసింది.

Also Read: DK Shivakumar: RCB అందరి హృదయాలను గెలుచుకుంది.. DK ట్వీట్ వైరల్!