Site icon HashtagU Telugu

Why This Silence Jr. NTR? : ఎన్టీఆర్ ఒక్క ట్వీట్ చేస్తే చాలు.. అందరి నోర్లు మూతపడతాయి..!

Why This silence NTR

Why This silence

Why This Silence? : అక్రమ కేసులో చంద్రబాబు (Chandrababu) ను జైలు పాలుచేశారని..బెయిల్ కూడా రానివ్వకుండా చేస్తుందని..కనీసం జైల్లో ప్రాణ హాని ఉంది..హౌస్ రిమాండ్ కు ఆదేశాలు ఇవ్వండని అడుగుతున్న ఏసీబీ కోర్ట్ అనుమతి ఇవ్వడం లేదని టీడీపీ శ్రేణులు బాధపడుతుంటే..కొంతమంది మాత్రం పుండు మీద కారం చల్లినట్లు ఎన్టీఆర్ (NTR)..చంద్రబాబు అరెస్ట్ ఫై స్పందించడం లేదని సోషల్ మీడియా వేదికగా కథనాలు అల్లుతున్నారు.

చంద్రబాబు అన్న.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్న తీవ్ర స్థాయిలో మండిపడే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV)కు ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితి కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు అయింది. ఇంకేం చంద్రబాబును ఒక రేంజ్ లో ఆడేసుకుంటూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నాడు. చంద్రబాబు అరెస్ట్ పైన్ కాదు..చంద్రబాబు కు మద్దతు ఇస్తున్న వారిపై కూడా సెటైర్లు..విమర్శలు చేస్తూ పోస్టులు పెడుతున్నాడు. ఇదే అనుకుంటే ఇప్పుడు ఎన్టీఆర్ (NTR).. చంద్రబాబు అరెస్ట్ ఫై స్పందించడం లేదని తనదైన శైలిలో ట్వీట్ చేసి వార్తల్లో నిలిచాడు.

చంద్రబాబు బాబు అరెస్టుతో వీకెండ్ పార్టీ చేసుకుంటున్న సీనియర్ ఎన్టీఆర్ (Sr. NTR) అంటూ సీనియర్ ఎన్టీఆర్ పాటను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వర్మ… ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ చేస్తే కనీసం జూనియర్ ఎన్టీఆర్ బాబు అరెస్టును కూడా ఖండించ లేదని పేర్కొన్నారు. ఈ పరిణామంతో చంద్రబాబు, టీడీపీ భవిష్యత్తు దబిడి దిబిడే అని స్పష్టంగా రుజువైందని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. అంతకుముందు హే చంద్రబాబు.. నిన్ను జైల్లో పడేసినందుకు మీ సూపర్ క్లోజ్ ఫిలిం ఇండస్ట్రీ సూపర్ బిగ్గీలు కూడా ఎవరూ సీరియస్ గా స్పందించలేదని పేర్కొని, వారెవరు చంద్రబాబును పట్టించుకోవడం లేదని సెటైర్లు వేశారు.

వారిని వెనకనుంచి కాదు ముందు నుంచి కత్తితో పొడిచేయాలి అని నీకు అనిపించడంలేదా అంటూ చంద్రబాబును టార్గెట్ చేశారు. మరో పోస్టులో హాలీవుడ్ నుండి స్టీవెన్ స్పీల్‌బర్గ్ లాగా, సిద్ధార్థ్ లూథ్రా ఢిల్లీ నుండి వచ్చి మన రాజమౌళి కా బాప్, అడ్వకేట్ పొన్నవోలు సుధాకరెడ్డి చేతిలో చిత్తుగా ఓడిపోయాడని..ఇది లీగల్ బాహుబలి అంటూ వర్మ పేర్కొన్నారు. వర్మ చేసిన ఈ ట్వీట్స్ కు టీడీపీ, వైసీపీ వర్గాల మాటల దాడి చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరి తిట్టిపోసుకుంటూ తెగ హంగామా చేస్తున్నారు. ఇలా చంద్రబాబు అరెస్ట్ ఇష్యూని తనదైన స్టైల్‌లో రచ్చ రంభోలాగా వర్మ మార్చేశాడు.

కేవలం వర్మ మాత్రమే కాదు ప్రముఖ నిర్మాత నట్టికుమార్ సైతం చంద్రబాబు ఫై అరెస్ట్ ఫై ఎన్టీఆర్ , టాలీవుడ్ ప్రముఖులు స్పందించకపోవడం ఫై ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టుపై తెలుగు సినీ పరిశ్రమ స్పందించకపోవడం నాకు చాలా బాధ కలిగించింది. జూనియర్‌ ఎన్టీఆర్‌ సహా చిరంజీవి (Chiranjeevi), మురళీమోహన్‌ (Murali Mohan), అశ్వనీదత్‌ (Producer Ashwini Dutt), రాజమౌళి (Rajamouli), దామోదరప్రసాద్‌ వంటి సినీ ప్రముఖులతో పాటు తుమ్మల ఇంటి పేరును నందమూరిలాగా ఫీలయ్యే నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్‌ కానీ ఇతర సినీ పరిశ్రమ పెద్దలెవరూ చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించకపోవడం దారుణమన్నారు.

ఇప్పటివరకు చంద్రబాబు అరెస్ట్ అనంతరం దర్శకుడు కే రాఘవేంద్ర రావు తప్ప మరో వ్యక్తి స్పందించలేదు. టాలీవుడ్ లో చంద్రబాబు అభిమానులు, మద్దతుదారులు చాలామందే ఉన్నారు. వీరంతా కూడా చంద్రబాబు పదవిలో ఉన్నప్పుడు మాకు ఇవి కావాలి!…అవి కావాలి! అని లబ్ది పొందిన వారే. ప్రతీ సందర్భంలో సినీ పరిశ్రమ కోసం ముందుండే వ్యక్తిగా చంద్రబాబు పేరు సంపాదించుకున్నారు. ఓ వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడుగా అండగా ఉండటం మానవత్వం. చంద్రబాబుకు మద్దతుగా నిలబడితే జగన్‌ ఉరితీస్తాడా? చంద్రబాబు చేసిన సేవలను గౌరవించి ఆయనకు అండగా నిలబడాలి. తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌లో నందమూరి అభిమానులు ఏమైపోయారు. ఎందుకు స్పందించడం లేదు? అని నట్టి కుమార్‌ ప్రశ్నించారు.

Read Also : Chandrababu Remand: చంద్రబాబును కలిసేందుకు రాజమండ్రి జైలుకు జనసేనాని

వాస్తవానికి సురేష్ బాబుకు విశాఖలో స్టూడియోకి స్థలం ఇచ్చింది చంద్రబాబే.. ఇక మురళీమోహన్ తో బాబుకి బంధం గురించి ప్రత్యేకంగా చెప్పే పనిలేదు. అలాగే బోయపాటి శ్రీను, రాజమౌళి లాంటి వారికి చంద్రబాబుతో సాన్నిహిత్యం బాగానే ఉంది. అయినప్పటికీ ఇలాంటి వాళ్లు కూడా చంద్రబాబు అరెస్ట్ పై స్పందించలేదు. వీరంతా సైలెంట్ గా ఉండేసరికి వైసీపీ శ్రేణులు రెచ్చిపోతూ..టీడీపీ బలాన్ని తగ్గించే పనిచేస్తున్నారు. ఇప్పటికైనా జూ. ఎన్టీఆర్ తో పాటు టాలీవుడ్ ప్రముఖులు స్పందిస్తే బాగుంటుందని..అందర్నీ నోర్లు మూతపడతాయని టీడీపీ శ్రేణులు అంటున్నారు.